తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Ts Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, వచ్చే 5 రోజులు ఉక్కపోతే!

AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, వచ్చే 5 రోజులు ఉక్కపోతే!

03 March 2024, 17:42 IST

AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత మొదలైంది. ఏపీ, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

  • AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత మొదలైంది. ఏపీ, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు(AP TS Weather) పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్న సమయంలో ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మార్చి నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత మొదలైంది. తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పెరిగిందని హైదరాబాద్ (Hyderabad )వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ఏపీలోనూ ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. 
(1 / 6)
AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు(AP TS Weather) పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్న సమయంలో ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మార్చి నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత మొదలైంది. తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పెరిగిందని హైదరాబాద్ (Hyderabad )వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ఏపీలోనూ ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. (Image Source Pixabay )
రానున్న ఐదు రోజులు పాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు(Temperatures) పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
(2 / 6)
రానున్న ఐదు రోజులు పాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు(Temperatures) పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. (Image Source Pixabay )
తెలంగాణలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ (IMD)తెలిపింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.
(3 / 6)
తెలంగాణలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ (IMD)తెలిపింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.(Image Source Pixabay )
నిజామాబాద్​ లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, నల్గొండ, మహబూబ్​ నగర్, హైదరాబాద్​ లో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకి 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నాయి. మార్చి 7 వరకు ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  
(4 / 6)
నిజామాబాద్​ లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, నల్గొండ, మహబూబ్​ నగర్, హైదరాబాద్​ లో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకి 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నాయి. మార్చి 7 వరకు ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  (Image Source Pixabay )
ఏపీలోని విజయవాడతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇవాళ విజయవాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.  ఏపీలో పగటి పూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మార్చి మొదట్లోనే ఎండలు మొదలవ్వగా, రానున్న మూడు నెలల్లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  
(5 / 6)
ఏపీలోని విజయవాడతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇవాళ విజయవాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.  ఏపీలో పగటి పూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మార్చి మొదట్లోనే ఎండలు మొదలవ్వగా, రానున్న మూడు నెలల్లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  (Image Source Pixabay )
తెలంగాణలోని సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
(6 / 6)
తెలంగాణలోని సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. (Image Source Pixabay )

    ఆర్టికల్ షేర్ చేయండి