తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amaravati Capital: అమరావతి అభివృద్ధికి బిగ్ బూస్ట్, రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదనలకు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ఆమోదం

Amaravati Capital: అమరావతి అభివృద్ధికి బిగ్ బూస్ట్, రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదనలకు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ఆమోదం

10 November 2024, 17:32 IST

Amaravati Capital Development : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతి క్యాపిటల్ అభివృద్ధికి సీఆర్‌డీఏ పంపిన ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఆమోదం తెలిపాయి. ఈ రెండు సంస్థలు అమరావతి నిర్మాణానికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర సాయం అందించనున్నాయి.

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అమరావతి నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం అందించనున్నాయని తెలిపింది. 
(1 / 6)

అమరావతి క్యాపిటల్ అభివృద్ధికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సమర్పించగా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు కూడా ఆమోదం తెలిపాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసేందుకు ఈ రెండూ ముందుకు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
(2 / 6)

కేంద్రం సహకారంతో ఇతర నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. వరల్డ్ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం కల్పించింది. 
(3 / 6)

అమరావతి అభివృద్ధికి దశల వారీగా బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు సీఆర్డీఏకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే ఈ నిధుల కోసం ఓ ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి నిర్మాణానికి  బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.  
(4 / 6)

ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ అధీనంలో అమరావతి అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు కానున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు, ఎల్లుండి దిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
(5 / 6)

అమరావతి రాజధాని అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలుకు సీఆర్‌డీఏను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన రహదారులు, డ్రైనేజీలు, డక్ట్ లు, వరద నీటి ప్రవాహ కాలువలు, నీటి రిజర్వాయర్లు, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో సీఆర్డీఏను ఆదేశించింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి