తెలుగు న్యూస్  /  ఫోటో  /  Helmate Mandate : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు తప్పనిసరి, నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు- హైకోర్టు ఆదేశాలు

Helmate Mandate : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు తప్పనిసరి, నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు- హైకోర్టు ఆదేశాలు

27 June 2024, 15:37 IST

Helmate Mandate :  హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణ నష్టం పెరుగుతోందని న్యాయవాది యోగేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు దిచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.

  • Helmate Mandate :  హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణ నష్టం పెరుగుతోందని న్యాయవాది యోగేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు దిచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.
హెల్మెట్లు ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణ నష్టం పెరుగుతోందని న్యాయవాది యోగేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు దిచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.  
(1 / 6)
హెల్మెట్లు ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణ నష్టం పెరుగుతోందని న్యాయవాది యోగేశ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు దిచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.  
హెల్మెట్లు ధరించకపోవడంలో వల్ల 3042 మంది చనిపోయారని న్యాయవాది యోగేష్ కోర్టుకు తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జరిమానాలు విధించకపోవడం కూడా ఒక కారణంగా తెలిపారు.  
(2 / 6)
హెల్మెట్లు ధరించకపోవడంలో వల్ల 3042 మంది చనిపోయారని న్యాయవాది యోగేష్ కోర్టుకు తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జరిమానాలు విధించకపోవడం కూడా ఒక కారణంగా తెలిపారు.  (Pexels)
దిచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని ఏపీ ప్రభుత్వం, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మోటారు వాహన చట్టం నిబంధనలు తప్పనిసరిగా అమలుచేయాలని పేర్కొంది.  మోటారు చట్టం నిబంధనలను ఎంత మేరకు అమలు చేస్తున్నారో తెలియజేయాలని కౌంటర్‌ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
(3 / 6)
దిచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని ఏపీ ప్రభుత్వం, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మోటారు వాహన చట్టం నిబంధనలు తప్పనిసరిగా అమలుచేయాలని పేర్కొంది.  మోటారు చట్టం నిబంధనలను ఎంత మేరకు అమలు చేస్తున్నారో తెలియజేయాలని కౌంటర్‌ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. (Pexels)
హెల్మెట్లు ధరించకపోవడం వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఏపీ న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. వాహన తనిఖీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు తప్పనిసరిగా బాడీ కెమెరాలను ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని పేర్కొంది.   
(4 / 6)
హెల్మెట్లు ధరించకపోవడం వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఏపీ న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. వాహన తనిఖీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు తప్పనిసరిగా బాడీ కెమెరాలను ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని పేర్కొంది.   (Pexels)
న్యాయవాది యోగేశ్‌ వేసిన పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. దిచక్రవాహనదారులు తప్పనిసరిగా  హెల్మెట్‌ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హెల్మెట్‌ ధరించకపోతే కేసులు నమోదు చేయొచ్చని పోలీసులకు సూచించారు. 
(5 / 6)
న్యాయవాది యోగేశ్‌ వేసిన పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. దిచక్రవాహనదారులు తప్పనిసరిగా  హెల్మెట్‌ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హెల్మెట్‌ ధరించకపోతే కేసులు నమోదు చేయొచ్చని పోలీసులకు సూచించారు. (Pexels)
మోటారు వాహనాల చట్ట నిబంధనలు తెలియజేసేలా అధిక సర్క్యులేషన్‌ గల ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  
(6 / 6)
మోటారు వాహనాల చట్ట నిబంధనలు తెలియజేసేలా అధిక సర్క్యులేషన్‌ గల ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

    ఆర్టికల్ షేర్ చేయండి