తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Kohli Records: సెమీఫైనల్‍లో విరాట్ కోహ్లీ సృష్టించిన 4 రికార్డులు ఇవే

Virat Kohli Records: సెమీఫైనల్‍లో విరాట్ కోహ్లీ సృష్టించిన 4 రికార్డులు ఇవే

15 November 2023, 20:40 IST

Virat Kohli Records: వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో సెంచరీ చేసిన భారత స్టార్ బ్యాటర్ పలు రికార్డులను సృష్టించాడు. 50 వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించటంతో పాటు మరిన్ని రికార్డులు నెలకొల్పాడు. ఆ వివరాలివే. 

Virat Kohli Records: వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో సెంచరీ చేసిన భారత స్టార్ బ్యాటర్ పలు రికార్డులను సృష్టించాడు. 50 వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించటంతో పాటు మరిన్ని రికార్డులు నెలకొల్పాడు. ఆ వివరాలివే. 
న్యూజిలాండ్‍తో నేడు (నవంబర్ 15) జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117 పరుగులు; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం చేశాడు. దీంతో పలు రికార్డులను బద్దలుకొట్టాడు.
(1 / 7)
న్యూజిలాండ్‍తో నేడు (నవంబర్ 15) జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117 పరుగులు; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం చేశాడు. దీంతో పలు రికార్డులను బద్దలుకొట్టాడు.(PTI)
అంతర్జాతీయ వన్డే క్రికెట్‍లో అత్యధిక శతకాలు చేసిన రికార్డును టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీలు)ను అధిగమించాడు. అలాగే, 50 వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగానూ కోహ్లీ అద్భుత చరిత్ర సృష్టించాడు.
(2 / 7)
అంతర్జాతీయ వన్డే క్రికెట్‍లో అత్యధిక శతకాలు చేసిన రికార్డును టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీలు)ను అధిగమించాడు. అలాగే, 50 వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగానూ కోహ్లీ అద్భుత చరిత్ర సృష్టించాడు.(AFP)
సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 వన్డే శతకాలు చేశాడు. అయితే, 279 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఆ రికార్డును బద్దలుకొట్టి 50 శతకాలు చేశాడు. 
(3 / 7)
సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 వన్డే శతకాలు చేశాడు. అయితే, 279 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఆ రికార్డును బద్దలుకొట్టి 50 శతకాలు చేశాడు. (AFP)
ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా విరాట్ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. 
(4 / 7)
ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా విరాట్ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. (Seshadri Sukumar)
2003 వన్డే ప్రపంచకప్‍లో 673 రన్స్ చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఆ రికార్డు ఉండేది. అయితే, ఈ శతకంతో ప్రస్తుత ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు 711 పరుగులకు కోహ్లీ చేరాడు. సచిన్‍ను అధిగమించి ఓ ప్రపంచకప్ ఎడిషన్‍లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే, ఓ ప్రపంచకప్ ఎడిషన్‍లో 700 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గానూ కోహ్లీ ఘనత సాధించాడు. 
(5 / 7)
2003 వన్డే ప్రపంచకప్‍లో 673 రన్స్ చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఆ రికార్డు ఉండేది. అయితే, ఈ శతకంతో ప్రస్తుత ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు 711 పరుగులకు కోహ్లీ చేరాడు. సచిన్‍ను అధిగమించి ఓ ప్రపంచకప్ ఎడిషన్‍లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే, ఓ ప్రపంచకప్ ఎడిషన్‍లో 700 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గానూ కోహ్లీ ఘనత సాధించాడు. (ANI)
ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ కైవసం అయింది. ఈ ప్రపంచకప్‍లో అతడు ఎనిమిదిసార్లు (3 సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు) 50 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. 2003 ప్రపంచకప్‍లో సచిన్ టెండూల్కర్, 2019 ఎడిషన్‍లో షకీబుల్ హసన్ ఏడుసార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేయగా.. వీరిద్దరినీ ఇప్పుడు కోహ్లీ దాటేశాడు. 
(6 / 7)
ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ కైవసం అయింది. ఈ ప్రపంచకప్‍లో అతడు ఎనిమిదిసార్లు (3 సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు) 50 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. 2003 ప్రపంచకప్‍లో సచిన్ టెండూల్కర్, 2019 ఎడిషన్‍లో షకీబుల్ హసన్ ఏడుసార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేయగా.. వీరిద్దరినీ ఇప్పుడు కోహ్లీ దాటేశాడు. (Seshadri Sukumar)
న్యూజిలాండ్‍పై ఎక్కువ వన్డే శతకాలు భారత ప్లేయర్‌గా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. న్యూజిలాండ్‍తో ఆడిన 31 వన్డే ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ ఆరు శతకాలు చేయగా.. విరాట్ కోహ్లీ 23 ఇన్నింగ్స్‌లోనే ఆరు సెంచరీలకు చేరుకున్నాడు. 
(7 / 7)
న్యూజిలాండ్‍పై ఎక్కువ వన్డే శతకాలు భారత ప్లేయర్‌గా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. న్యూజిలాండ్‍తో ఆడిన 31 వన్డే ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ ఆరు శతకాలు చేయగా.. విరాట్ కోహ్లీ 23 ఇన్నింగ్స్‌లోనే ఆరు సెంచరీలకు చేరుకున్నాడు. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి