తెలుగు న్యూస్  /  ఫోటో  /  Afc Asian Cup Ind Vs Aus: భారత్‍కు నిరాశ.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

AFC Asian Cup IND vs AUS: భారత్‍కు నిరాశ.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

13 January 2024, 20:32 IST

AFC Asian Cup India vs Australia: ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ ఫుట్‍బాల్ టోర్నీని భారత జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. గ్రూప్-బీలో నేడు (జనవరి 13) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.

  • AFC Asian Cup India vs Australia: ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ ఫుట్‍బాల్ టోర్నీని భారత జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. గ్రూప్-బీలో నేడు (జనవరి 13) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.
ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ గ్రూప్-బీ తొలి మ్యాచ్‍లో భారత ఫుట్‍బాల్ జట్టు పరాజయం చెందింది. ఈ మ్యాచ్‍లో టీమిండియాకు 0-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైంది. 
(1 / 5)
ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ గ్రూప్-బీ తొలి మ్యాచ్‍లో భారత ఫుట్‍బాల్ జట్టు పరాజయం చెందింది. ఈ మ్యాచ్‍లో టీమిండియాకు 0-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైంది. (AFP)
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఖతార్‌లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో నేడు (జనవరి 13) ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‍లో ప్రపంచ 25వ ర్యాంక్ జట్టు ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్ (50వ నిమిషం), జోర్డాన్ బ్రోస్ (73వ నిమిషం) గోల్స్ చేశారు. ప్రస్తుతం భారత్ 102వ ర్యాంకులో ఉంది. 
(2 / 5)
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఖతార్‌లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో నేడు (జనవరి 13) ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‍లో ప్రపంచ 25వ ర్యాంక్ జట్టు ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్ (50వ నిమిషం), జోర్డాన్ బ్రోస్ (73వ నిమిషం) గోల్స్ చేశారు. ప్రస్తుతం భారత్ 102వ ర్యాంకులో ఉంది. (AFP)
ఈ మ్యాచ్ ఆరంభంలో ఆస్ట్రేలియాను సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత జట్టు సమర్థంగా నిలువరించింది. దీంతో ఫస్ట్ హాఫ్‍లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. టీమిండియా ఆటగాళ్లు గట్టి పోటీని ఇచ్చారు. 
(3 / 5)
ఈ మ్యాచ్ ఆరంభంలో ఆస్ట్రేలియాను సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత జట్టు సమర్థంగా నిలువరించింది. దీంతో ఫస్ట్ హాఫ్‍లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. టీమిండియా ఆటగాళ్లు గట్టి పోటీని ఇచ్చారు. (REUTERS)
అయితే, ఈ మ్యాచ్ రెండో అర్ధభాగం ఆరంభంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్సన్ ఇర్విన్ 50వ నిమిషంలో బంతిని గోల్ పోస్టులోకి కొట్టాడు. దీంతో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేటి తర్వాత జోర్డాన్ బ్రోస్ గోల్ బాదడంతో ఆస్ట్రేలియా 2-0కు చేరింది. 
(4 / 5)
అయితే, ఈ మ్యాచ్ రెండో అర్ధభాగం ఆరంభంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్సన్ ఇర్విన్ 50వ నిమిషంలో బంతిని గోల్ పోస్టులోకి కొట్టాడు. దీంతో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేటి తర్వాత జోర్డాన్ బ్రోస్ గోల్ బాదడంతో ఆస్ట్రేలియా 2-0కు చేరింది. (AP)
ఈ మ్యాచ్‍లో భారత్ గోల్ కొట్టకపోయినా మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ గ్రూప్-బీలో తదుపరి ఉజ్బెకిస్థాన్‍తో జనవరి 18న టీమిండియా తలపడనుంది. 
(5 / 5)
ఈ మ్యాచ్‍లో భారత్ గోల్ కొట్టకపోయినా మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ గ్రూప్-బీలో తదుపరి ఉజ్బెకిస్థాన్‍తో జనవరి 18న టీమిండియా తలపడనుంది. (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి