తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aditya-l1 Mission: ఆదిత్య ఎల్ 1 లక్ష్యానికి చేరేది ఏ రోజో తెలుసా?

Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 లక్ష్యానికి చేరేది ఏ రోజో తెలుసా?

17 October 2023, 20:05 IST

Aditya-L1 Mission: సూర్యుడి అధ్యయనం కోసం భారత్ చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఆదిత్య ఎల్ 1. ఈ మిషన్ సూర్యుడికి సమీపంలోని ఎల్ 1 పాయింట్ వద్దకు చేరేది 2024 లోనే అని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. 

Aditya-L1 Mission: సూర్యుడి అధ్యయనం కోసం భారత్ చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఆదిత్య ఎల్ 1. ఈ మిషన్ సూర్యుడికి సమీపంలోని ఎల్ 1 పాయింట్ వద్దకు చేరేది 2024 లోనే అని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. 
ఆదిత్య-ఎల్ 1 అంతరిక్ష నౌక 2024 జనవరి మధ్య నాటికి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1)కి చేరుకోనుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. సూర్యుడిని సమగ్రంగా అధ్యయనం చేయడం లక్ష్యంగా ఈ మిషన్ ను ప్రారంభించారు. భూమి నుండి సూర్యుని దిశలో దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 లొ ఒక స్పెసిఫిక్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 నిలుస్తుంది.
(1 / 5)
ఆదిత్య-ఎల్ 1 అంతరిక్ష నౌక 2024 జనవరి మధ్య నాటికి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1)కి చేరుకోనుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. సూర్యుడిని సమగ్రంగా అధ్యయనం చేయడం లక్ష్యంగా ఈ మిషన్ ను ప్రారంభించారు. భూమి నుండి సూర్యుని దిశలో దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 లొ ఒక స్పెసిఫిక్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 నిలుస్తుంది.(ISRO)
ఆదిత్య-L1 మిషన్ స్పేస్‌క్రాఫ్ట్ సౌరాగ్ని, సౌర తుపాను, కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు, కరోనల్ హీటింగ్, మాగ్నెటిక్ రీకనెక్షన్‌లపై అధ్యయనం చేస్తుంది. ఇందుకు గానూ ఏడు విభిన్న పేలోడ్‌ లను అమర్చారు.
(2 / 5)
ఆదిత్య-L1 మిషన్ స్పేస్‌క్రాఫ్ట్ సౌరాగ్ని, సౌర తుపాను, కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు, కరోనల్ హీటింగ్, మాగ్నెటిక్ రీకనెక్షన్‌లపై అధ్యయనం చేస్తుంది. ఇందుకు గానూ ఏడు విభిన్న పేలోడ్‌ లను అమర్చారు.(ISRO Facebook)
ఆదిత్య ఎల్ 1 లోని నాలుగు పే లోడ్స్ సౌరకాంతిని అధ్యయనం చేస్తాయి, సౌర పరిశోధన కోసం విలువైన డేటాను అందిస్తాయి. ఇతర మూడు పే లోడ్స్ సూర్యుని చుట్టూ ఉన్న ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి అధ్యయనం చేస్తాయి.
(3 / 5)
ఆదిత్య ఎల్ 1 లోని నాలుగు పే లోడ్స్ సౌరకాంతిని అధ్యయనం చేస్తాయి, సౌర పరిశోధన కోసం విలువైన డేటాను అందిస్తాయి. ఇతర మూడు పే లోడ్స్ సూర్యుని చుట్టూ ఉన్న ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి అధ్యయనం చేస్తాయి.(ANI)
ఆదిత్య-L1 మిషన్ భూమి నుండి సెప్టెంబర్ 2న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది L1 పాయింట్‌కి చేరుకోవడానికి దాదాపు 110 రోజులు పట్టవచ్చని అంచనా. ఈ 110 రోజుల ప్రయాణం మిషన్ టైమ్‌ లైన్‌లో కీలకమైన భాగం.
(4 / 5)
ఆదిత్య-L1 మిషన్ భూమి నుండి సెప్టెంబర్ 2న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది L1 పాయింట్‌కి చేరుకోవడానికి దాదాపు 110 రోజులు పట్టవచ్చని అంచనా. ఈ 110 రోజుల ప్రయాణం మిషన్ టైమ్‌ లైన్‌లో కీలకమైన భాగం.(ANI)
ఆదిత్య-L1 మిషన్ తర్వాత,  జీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ, గగన్‌ యాన్ మానవ రహిత మిషన్, జనవరికి ముందు PSLV వంటి ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. ఆ తరువాత, అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని చేపట్టనుంది.
(5 / 5)
ఆదిత్య-L1 మిషన్ తర్వాత,  జీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ, గగన్‌ యాన్ మానవ రహిత మిషన్, జనవరికి ముందు PSLV వంటి ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. ఆ తరువాత, అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని చేపట్టనుంది.(NASA Solar Dynamics Observatory)

    ఆర్టికల్ షేర్ చేయండి