తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aditya L1: ఆదిత్యుడి అధ్యయనంలో మరో కీలక ముందడుగు..; వైరల్ ఫొటోస్

Aditya L1: ఆదిత్యుడి అధ్యయనంలో మరో కీలక ముందడుగు..; వైరల్ ఫొటోస్

06 January 2024, 19:34 IST

Aditya L1: సూర్యునిపై అధ్యయనం చేయడం కోసం ప్రయోగించిన తొలి భారతీయ అంతరిక్ష అబ్జర్వేటరీ ఆదిత్య - ఎల్1ను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్-1 కక్ష్యలో చేర్చింది.

  • Aditya L1: సూర్యునిపై అధ్యయనం చేయడం కోసం ప్రయోగించిన తొలి భారతీయ అంతరిక్ష అబ్జర్వేటరీ ఆదిత్య - ఎల్1ను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్-1 కక్ష్యలో చేర్చింది.
సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం విజయవంతంగా చివరి నిర్దేశిత కక్ష్య లాగ్రాంజ్ ఎల్ 1 లోకి చేరింది.
(1 / 7)
సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం విజయవంతంగా చివరి నిర్దేశిత కక్ష్య లాగ్రాంజ్ ఎల్ 1 లోకి చేరింది.
జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆదిత్య ఎల్ 1 నిర్దేశిత ఎల్ 1 పాయింట్ కు చేరుకుందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ప్రకటించారు. ఆ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 ను స్థిరంగా ఉంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. 
(2 / 7)
జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆదిత్య ఎల్ 1 నిర్దేశిత ఎల్ 1 పాయింట్ కు చేరుకుందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ప్రకటించారు. ఆ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 ను స్థిరంగా ఉంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. 
ఆదిత్య ఎల్ 1 మరో మైలురాయిని అధిగమించడంపై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. "భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 చివరి గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను సాకారం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
(3 / 7)

ఇస్రో సాధించిన ఈ అసాధారణ విజయాన్ని కొనియాడడంలో దేశ ప్రజలందరితో తాను కూడా కలిశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మానవాళి ప్రయోజనం కోసం సైన్స్‌ ను వినియోగించడాన్ని కొనసాగిస్తామన్నారు. 
(4 / 7)
ఇస్రో సాధించిన ఈ అసాధారణ విజయాన్ని కొనియాడడంలో దేశ ప్రజలందరితో తాను కూడా కలిశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మానవాళి ప్రయోజనం కోసం సైన్స్‌ ను వినియోగించడాన్ని కొనసాగిస్తామన్నారు. 
ప్రస్తుతం భూమికి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుండి ప్రయోగించారు. ఆదిత్య-ఎల్1 రాబోయే ఐదేళ్లపాటు పనిచేస్తుందని భావిస్తున్నారు.
(5 / 7)
ప్రస్తుతం భూమికి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుండి ప్రయోగించారు. ఆదిత్య-ఎల్1 రాబోయే ఐదేళ్లపాటు పనిచేస్తుందని భావిస్తున్నారు.(ISRO)
ఆదిత్య L1 యొక్క ఏడు పేలోడ్‌లను దేశీయంగానే అభివృద్ధి చేశారు. వీటిని దేశంలోని వివిధ లాబోరేటరీల్లో రూపొందించారు. 
(6 / 7)
ఆదిత్య L1 యొక్క ఏడు పేలోడ్‌లను దేశీయంగానే అభివృద్ధి చేశారు. వీటిని దేశంలోని వివిధ లాబోరేటరీల్లో రూపొందించారు. 
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C57) గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)  రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఆదిత్య-L1 అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది.
(7 / 7)
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C57) గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)  రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఆదిత్య-L1 అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది.(ISRO)

    ఆర్టికల్ షేర్ చేయండి