తెలుగు న్యూస్  /  ఫోటో  /  Abhishek Sharma Record: మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్ అతడే..

Abhishek Sharma Record: మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్ అతడే..

07 July 2024, 21:20 IST

Abhishek Sharma Record: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన అతడు.. కెరీర్లో రెండో టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

  • Abhishek Sharma Record: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన అతడు.. కెరీర్లో రెండో టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
Abhishek Sharma Record: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20యే అభిషేక్ శర్మకు కెరీర్లో తొలి టీ20 మ్యాచ్. అందులో డకౌటై తీవ్రంగా నిరాశ పరిచిన అతడు.. రెండో టీ20లోనే మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.
(1 / 5)

Abhishek Sharma Record: కెరీర్లో ఆడిన రెండో టీ20లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా గతంలో 46 బంతుల్లోనే సెంచరీ చేయగా.. ఆ రికార్డును సమం చేశాడు. అయితే ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బాల్స్) పేరిట ఉండగా.. సూర్యకుమార్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు.
(2 / 5)

Abhishek Sharma Record: అంతేకాదు టీ20ల్లో ఇండియా తరఫున సెంచరీ చేసిన నాలుగో యంగెస్ట్ ప్లేయర్ కూడా అభిషేక్ శర్మనే. అతడు 23 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ సెంచరీ చేశాడు. అతని కంటే ముందు యశస్వి జైస్వాల్ (21 ఏళ్ల 270 రోజులు), శుభ్‌మన్ గిల్ (23 ఏళ్ల 146 రోజులు), సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు) ఈ ఘనత సాధించారు.
(3 / 5)

Abhishek Sharma Record: అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తర్వాతి 13 బంతుల్లో మరో 50 పరుగులు చేశాడంటే అతని జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మయర్స్ వేసిన ఓ ఓవర్లో ఏంకగా 28 పరుగులు రాబట్టాడు. వరుసగా మూడు సిక్స్ లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
(4 / 5)

Abhishek Sharma Record: అభిషేక్ శర్మ సెంచరీకి తోడు రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77, రింకు సింగ్ 22 బంతుల్లో 48 రన్స్ చేయడంతో ఇండియా 234 రన్స్ చేసింది. తర్వాత జింబాబ్వే కేవలం 134 రన్స్ కే కుప్పకూలడంతో 100 పరుగులతో ఇండియా గెలిచింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి