తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cherlapally Railway Station : ఇది ఎయిర్‌పోర్ట్ కాదు.. చర్లపల్లి రైల్వే స్టేషన్.. ఎలా ఉందో చాశారా?

Cherlapally Railway Station : ఇది ఎయిర్‌పోర్ట్ కాదు.. చర్లపల్లి రైల్వే స్టేషన్.. ఎలా ఉందో చాశారా?

08 October 2024, 16:39 IST

Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో రద్దీని తగ్గించనుంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని చెబుతున్నారు.

  • Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో రద్దీని తగ్గించనుంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని చెబుతున్నారు.
చర్లపల్లిలో నిర్మించిన రైల్వేస్టేషన్ విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది. ఈ స్టేషన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ తగ్గుతుంది. 
(1 / 6)
చర్లపల్లిలో నిర్మించిన రైల్వేస్టేషన్ విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది. ఈ స్టేషన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ తగ్గుతుంది. (@kishanreddybjp)
హైదరాబాద్‌కు తూర్పున చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. 
(2 / 6)
హైదరాబాద్‌కు తూర్పున చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. (@kishanreddybjp)
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. 
(3 / 6)
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. (@kishanreddybjp)
చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించారు. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం కాబోతోంది.
(4 / 6)
చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించారు. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం కాబోతోంది.(@kishanreddybjp)
ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్​ రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సాఫీగా రైల్వే స్టేషన్‌ను చేరుకునే అవకాశం ఉండనుంది. 
(5 / 6)
ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్​ రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సాఫీగా రైల్వే స్టేషన్‌ను చేరుకునే అవకాశం ఉండనుంది. (@kishanreddybjp)
ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా.. మరో 4 ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోంది.
(6 / 6)
ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా.. మరో 4 ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోంది.(@kishanreddybjp)

    ఆర్టికల్ షేర్ చేయండి