తెలుగు న్యూస్  /  ఫోటో  /  69th National Film Awards: సత్తాచాటిన తెలుగు సినిమాలు.. 10 జాతీయ అవార్డులు: వివరాలివే

69th National Film Awards: సత్తాచాటిన తెలుగు సినిమాలు.. 10 జాతీయ అవార్డులు: వివరాలివే

24 August 2023, 22:59 IST

69th National Film Awards: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తాచాటాయి. 2021కు గాను ఏకంగా తెలుగు చిత్రాలకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. వాటి వివరాలివే.

  • 69th National Film Awards: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తాచాటాయి. 2021కు గాను ఏకంగా తెలుగు చిత్రాలకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. వాటి వివరాలివే.
2021కు గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు (ఆగస్టు 24) ప్రకటించింది. తెలుగు చిత్రాలకు ఏకంగా పది నేషనల్ అవార్డులు వచ్చాయి.  
(1 / 8)
2021కు గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు (ఆగస్టు 24) ప్రకటించింది. తెలుగు చిత్రాలకు ఏకంగా పది నేషనల్ అవార్డులు వచ్చాయి.  
జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. పుష్ప: ది రైజ్ చిత్రానికి ఈ అవార్డును పొందాడు బన్నీ. తెలుగు సినీ పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన తొలి యాక్టర్‌గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. 
(2 / 8)

పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడి (పాటలు)గా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. 
(3 / 8)
పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడి (పాటలు)గా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. 
2021కు గాను ‘ఉప్పెన’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. 
(4 / 8)
2021కు గాను ‘ఉప్పెన’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. 
కొండపొలం సినిమాలో ‘ధం ధం ధం’ అనే పాటకు గాను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‍కు ఉత్తమ జాతీయ లిరిక్స్ అవార్డు దక్కింది. 
(5 / 8)
కొండపొలం సినిమాలో ‘ధం ధం ధం’ అనే పాటకు గాను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‍కు ఉత్తమ జాతీయ లిరిక్స్ అవార్డు దక్కింది. 
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి 2021కు గాను ఆరు ఉత్తమ జాతీయ అవార్డులు దక్కాయి. అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసిన ప్రజాదరణ పొందిన ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డును ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది.
(6 / 8)
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి 2021కు గాను ఆరు ఉత్తమ జాతీయ అవార్డులు దక్కాయి. అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసిన ప్రజాదరణ పొందిన ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డును ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)గా ఎంఎం కీరవాణి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. ఈ చిత్రంలో కొమురం భీముడో పాట పాడిన కాలభైరవకు ఉత్తమ జాతీయ మేల్ ప్లే బ్యాక్ సింగర్ పురస్కారం లభించింది. 
(7 / 8)
ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)గా ఎంఎం కీరవాణి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. ఈ చిత్రంలో కొమురం భీముడో పాట పాడిన కాలభైరవకు ఉత్తమ జాతీయ మేల్ ప్లే బ్యాక్ సింగర్ పురస్కారం లభించింది. (REUTERS)
ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్‍కు నేషనల్ ఫిల్మ్ అవార్డు దక్కింది. బెస్ట్ స్టంట్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఈ చిత్రానికే కింగ్ సోలోమాన్‍ను జాతీయ అవార్డు వరించింది. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో వి.శ్రీనివాస్ మోహన్‍కు ఆర్ఆర్ఆర్ సినిమాకే నేషనల్ అవార్డు దక్కింది. 
(8 / 8)
ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్‍కు నేషనల్ ఫిల్మ్ అవార్డు దక్కింది. బెస్ట్ స్టంట్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఈ చిత్రానికే కింగ్ సోలోమాన్‍ను జాతీయ అవార్డు వరించింది. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో వి.శ్రీనివాస్ మోహన్‍కు ఆర్ఆర్ఆర్ సినిమాకే నేషనల్ అవార్డు దక్కింది. (HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి