తెలుగు న్యూస్  /  ఫోటో  /  Watermelon Ideas । వేసవిలో పుచ్చకాయని ఆస్వాదించడానికి సృజనాత్మకమైన మార్గాలు!

Watermelon Ideas । వేసవిలో పుచ్చకాయని ఆస్వాదించడానికి సృజనాత్మకమైన మార్గాలు!

07 April 2023, 17:02 IST

Watermelon Ideas: వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండును కేవలం ముక్కలుగా కోసుకొని తినడం కాకుండా, ఇంకా చాలా విధాలుగా ఆస్వాదించవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి..

Watermelon Ideas: వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండును కేవలం ముక్కలుగా కోసుకొని తినడం కాకుండా, ఇంకా చాలా విధాలుగా ఆస్వాదించవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి..
వేసవిలో పుచ్చకాయ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ పండు లోపల ఎర్రగా, జ్యూసీగా ఉంటుంది.  పుచ్చకాయను ఆస్వాదించడానికి ఇక్కడ కొన్ని ఆహ్లాదకరమైన, సృజనాత్మక మార్గాలు చూడండి. 
(1 / 9)
వేసవిలో పుచ్చకాయ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ పండు లోపల ఎర్రగా, జ్యూసీగా ఉంటుంది.  పుచ్చకాయను ఆస్వాదించడానికి ఇక్కడ కొన్ని ఆహ్లాదకరమైన, సృజనాత్మక మార్గాలు చూడండి. (iStockphoto)
పుచ్చకాయ సల్సా: పుచ్చకాయ సల్సా బ్రేక్ టైంలో స్నాక్స్ గా లేదా పార్టీ టైమ్ లో  సైడ్ డిష్ గా తినవచ్చు. పుచ్చకాయ ముక్కలు, జలపెనో, ఎర్ర ఉల్లిపాయ, నిమ్మరసం కలిపి సల్సా సిద్ధం చేయండి. చిప్స్ లేదా రోస్టెడ్ చికెన్ లేదా రోస్టెడ్ చేపతో కుమ్మేయండి. 
(2 / 9)
పుచ్చకాయ సల్సా: పుచ్చకాయ సల్సా బ్రేక్ టైంలో స్నాక్స్ గా లేదా పార్టీ టైమ్ లో  సైడ్ డిష్ గా తినవచ్చు. పుచ్చకాయ ముక్కలు, జలపెనో, ఎర్ర ఉల్లిపాయ, నిమ్మరసం కలిపి సల్సా సిద్ధం చేయండి. చిప్స్ లేదా రోస్టెడ్ చికెన్ లేదా రోస్టెడ్ చేపతో కుమ్మేయండి. (Pinterest)
పుచ్చకాయ సలాడ్:  పుచ్చకాయ ముక్కలు, ఫెటా చీజ్,  తాజా పుదీనాతో పుచ్చకాయ సలాడ్ చేయండి. విభిన్న రుచులతో సమతుల్యంగా ఉంటుంది. 
(3 / 9)
పుచ్చకాయ సలాడ్:  పుచ్చకాయ ముక్కలు, ఫెటా చీజ్,  తాజా పుదీనాతో పుచ్చకాయ సలాడ్ చేయండి. విభిన్న రుచులతో సమతుల్యంగా ఉంటుంది. (Pinterest)
పుచ్చకాయ స్మూతీ:  ఆరోగ్యకరమైన వేసవి స్మూతీ కోసం పుచ్చకాయ, పెరుగు ,  ఐస్ కలపండి. ఈ స్మూతీ రుచికరమైనది మాత్రమే కాదు, మీ శరీరానికి మేలు చేసే విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది. 
(4 / 9)
పుచ్చకాయ స్మూతీ:  ఆరోగ్యకరమైన వేసవి స్మూతీ కోసం పుచ్చకాయ, పెరుగు ,  ఐస్ కలపండి. ఈ స్మూతీ రుచికరమైనది మాత్రమే కాదు, మీ శరీరానికి మేలు చేసే విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది. (Shutterstock)
పుచ్చకాయ సోర్బెట్: పుచ్చకాయ ముక్కలను ఫ్రీజ్ చేసి, అనంతరం నిమ్మరసం,  తేనె కలిపి సోర్బెట్ సిద్ధం చేయండి.  మిగిలిపోయిన పుచ్చకాయను ఉపయోగించడానికి ఇది గొప్ప మార్గం. 
(5 / 9)
పుచ్చకాయ సోర్బెట్: పుచ్చకాయ ముక్కలను ఫ్రీజ్ చేసి, అనంతరం నిమ్మరసం,  తేనె కలిపి సోర్బెట్ సిద్ధం చేయండి.  మిగిలిపోయిన పుచ్చకాయను ఉపయోగించడానికి ఇది గొప్ప మార్గం. (Pinterest)
పుచ్చకాయ మార్గరీటాస్: క్లాసిక్ కాక్‌టెయిల్‌లో ఫ్రూటీ ట్విస్ట్ కోసం తాజా పుచ్చకాయ రసం, నిమ్మరసం, టకీలా ,  ట్రిపుల్ సెకన్  కలపి కాక్‌టెయిల్‌ చేయండి. ఈ పానీయం సమ్మర్ పార్టీలు, బార్బెక్యూలకు సూపర్ గా ఉంటుంది. 
(6 / 9)
పుచ్చకాయ మార్గరీటాస్: క్లాసిక్ కాక్‌టెయిల్‌లో ఫ్రూటీ ట్విస్ట్ కోసం తాజా పుచ్చకాయ రసం, నిమ్మరసం, టకీలా ,  ట్రిపుల్ సెకన్  కలపి కాక్‌టెయిల్‌ చేయండి. ఈ పానీయం సమ్మర్ పార్టీలు, బార్బెక్యూలకు సూపర్ గా ఉంటుంది. (Pinterest)
పుచ్చకాయ కెగ్: పెద్ద పుచ్చకాయ పైభాగంలో ఒక రంధ్రం కట్ చేసి, పండును తీసివేసి, అందులో మీకు ఇష్టమైన కాక్‌టెయిల్‌తో నింపండి. మీ సమ్మర్ పార్టీలలో  డ్రింక్స్ అందించడానికి ఇది ఒక సృజనాత్మక మార్గం. 
(7 / 9)
పుచ్చకాయ కెగ్: పెద్ద పుచ్చకాయ పైభాగంలో ఒక రంధ్రం కట్ చేసి, పండును తీసివేసి, అందులో మీకు ఇష్టమైన కాక్‌టెయిల్‌తో నింపండి. మీ సమ్మర్ పార్టీలలో  డ్రింక్స్ అందించడానికి ఇది ఒక సృజనాత్మక మార్గం. (Pinterest)
పుచ్చకాయ పాప్సికల్స్: ఈ వేసవిలో పుచ్చకాయను ఆస్వాదించడానికి పుచ్చకాయ పాప్సికల్స్ మరొక ఆహ్లాదకరమైన మార్గం. పుచ్చకాయను తేనె, నిమ్మరసం, ఉప్పు వేసి మృదువుగా మారేంత వరకు కలపండి. అనంతరం ఈ మిశ్రమాన్ని పాప్సికల్ అచ్చులలో పోసి కనీసం 4 గంటలు ఫ్రీజ్ చేయండి. 
(8 / 9)
పుచ్చకాయ పాప్సికల్స్: ఈ వేసవిలో పుచ్చకాయను ఆస్వాదించడానికి పుచ్చకాయ పాప్సికల్స్ మరొక ఆహ్లాదకరమైన మార్గం. పుచ్చకాయను తేనె, నిమ్మరసం, ఉప్పు వేసి మృదువుగా మారేంత వరకు కలపండి. అనంతరం ఈ మిశ్రమాన్ని పాప్సికల్ అచ్చులలో పోసి కనీసం 4 గంటలు ఫ్రీజ్ చేయండి. (Photo: iStock)
పుచ్చకాయను అనేక రకాలుగా తినవచ్చు. మండు వేసవిలో ఈ జ్యుసి ఫ్రూట్‌ని ఆస్వాదించడానికి మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని ప్రయోగాలు చేయండి.
(9 / 9)
పుచ్చకాయను అనేక రకాలుగా తినవచ్చు. మండు వేసవిలో ఈ జ్యుసి ఫ్రూట్‌ని ఆస్వాదించడానికి మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని ప్రయోగాలు చేయండి.(iStock)

    ఆర్టికల్ షేర్ చేయండి