తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించే ఆహారం..

Dark circles: కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించే ఆహారం..

05 June 2023, 20:20 IST

Dark circles: కళ్లకింద నల్లటి వలయాలు విటమిన్లు, ఐరన్ లోపానికి సూచన కావచ్చు.  మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 

Dark circles: కళ్లకింద నల్లటి వలయాలు విటమిన్లు, ఐరన్ లోపానికి సూచన కావచ్చు.  మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 
కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మద్యం, ధూమపానం కూడా కారణం కావచ్చు. అయినప్పటికీ కంటి కింద నల్లటి వలయాలు తగ్గించడంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ ఆహారాలేంటో చూడండి. 
(1 / 6)
కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మద్యం, ధూమపానం కూడా కారణం కావచ్చు. అయినప్పటికీ కంటి కింద నల్లటి వలయాలు తగ్గించడంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ ఆహారాలేంటో చూడండి. (Freepik)
విటమిన్ సి:  ఇది చాలా ముఖ్యమైన విటమిన్. నల్లటి వలయాలు తగ్గడానికి సాయపడుతుంది. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, ఉసిరి, జామ, కివీ, బొప్పాయి వంటి నిమ్మజాతి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. 
(2 / 6)
విటమిన్ సి:  ఇది చాలా ముఖ్యమైన విటమిన్. నల్లటి వలయాలు తగ్గడానికి సాయపడుతుంది. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, ఉసిరి, జామ, కివీ, బొప్పాయి వంటి నిమ్మజాతి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. (Pixabay)
లైకోపీన్: టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. వండిన టమాటాల్లో, లేదా సాస్, టమాటా రసం ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటే పుచ్చకాయ, గులాబీ రంగు జామపండు, ఎరుపు రంగు క్యాప్సికంలో కూడా లైకోపిన్ ఉంటుంది. 
(3 / 6)
లైకోపీన్: టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. వండిన టమాటాల్లో, లేదా సాస్, టమాటా రసం ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటే పుచ్చకాయ, గులాబీ రంగు జామపండు, ఎరుపు రంగు క్యాప్సికంలో కూడా లైకోపిన్ ఉంటుంది. (Unsplash)
ఇనుము: ఆహారంలో ఇనుము లేకపోయినా ఈ సమస్య రావచ్చు.  పాలకూర, మెంతికూర చేర్చుకోవాలి. లేదా పప్పులు, బీన్స్, టోఫు, నువ్వులు, బెల్లంలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. 
(4 / 6)
ఇనుము: ఆహారంలో ఇనుము లేకపోయినా ఈ సమస్య రావచ్చు.  పాలకూర, మెంతికూర చేర్చుకోవాలి. లేదా పప్పులు, బీన్స్, టోఫు, నువ్వులు, బెల్లంలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. (Pinterest)
విటమిన్ ఇ: గింజలు, విత్తనాల్లో విటమిన్ ఇ  ఉంటుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగ, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలి. 
(5 / 6)
విటమిన్ ఇ: గింజలు, విత్తనాల్లో విటమిన్ ఇ  ఉంటుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగ, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలి. (Freepik)
విటమిన్ కె: పాలకూర, కొత్తిమీర, పుదీనాలో  ఇది ఉంటుంది.  వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ విటమిన్ కె స్థాయిలను పెంచుకోవచ్చు.
(6 / 6)
విటమిన్ కె: పాలకూర, కొత్తిమీర, పుదీనాలో  ఇది ఉంటుంది.  వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ విటమిన్ కె స్థాయిలను పెంచుకోవచ్చు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి