తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heat Rashes । చెమటకాయల నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద చిట్కాలు!

Heat Rashes । చెమటకాయల నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద చిట్కాలు!

08 January 2024, 18:58 IST

Heat Rashes: అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో చికిత్స ఉంటుంది. ఈ ఎండాకాలంలో చెమటకాయలు, దద్దుర్లు నుండి ఉపశమనం పొందడం కోసం కొన్ని సహజమైన ఆయుర్వేద నివారణలు ఇక్కడ చూడండి.

Heat Rashes: అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో చికిత్స ఉంటుంది. ఈ ఎండాకాలంలో చెమటకాయలు, దద్దుర్లు నుండి ఉపశమనం పొందడం కోసం కొన్ని సహజమైన ఆయుర్వేద నివారణలు ఇక్కడ చూడండి.
మలినాలు, అధిక చెమట, బ్యాక్టీరియా కారణంగా  మీ చెమట గ్రంథులు మూసుకుపోయినపుడు చెమటకాయలు, వేడి దద్దుర్లు ఏర్పడతాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం కూడా ఈ సమస్యకు దారి తీస్తుంది. వీటి చికిత్సకు, ప్రిక్లీ హీట్ రిలీఫ్ కోసం  కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను ఆయుర్వేద వైద్యురాలు, గట్ హెల్త్ కోచ్ డాక్టర్ డింపుల్ జంగ్దా వెల్లడించారు. 
(1 / 6)
మలినాలు, అధిక చెమట, బ్యాక్టీరియా కారణంగా  మీ చెమట గ్రంథులు మూసుకుపోయినపుడు చెమటకాయలు, వేడి దద్దుర్లు ఏర్పడతాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం కూడా ఈ సమస్యకు దారి తీస్తుంది. వీటి చికిత్సకు, ప్రిక్లీ హీట్ రిలీఫ్ కోసం  కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను ఆయుర్వేద వైద్యురాలు, గట్ హెల్త్ కోచ్ డాక్టర్ డింపుల్ జంగ్దా వెల్లడించారు. (Freepik )
గంధపు పొడిని కొద్దిగా నీళ్లలో కలిపి దద్దుర్లు ఉన్న చోట రాస్తే చెమటకాయల వల్ల కలిగే మంట, బాధాకరమైన అనుభూతి తగ్గుతుంది. ఈ పేస్ట్ చేయడానికి 2 భాగాల గంధపు పొడిని 1 భాగం నీటితో కలపండి. 
(2 / 6)
గంధపు పొడిని కొద్దిగా నీళ్లలో కలిపి దద్దుర్లు ఉన్న చోట రాస్తే చెమటకాయల వల్ల కలిగే మంట, బాధాకరమైన అనుభూతి తగ్గుతుంది. ఈ పేస్ట్ చేయడానికి 2 భాగాల గంధపు పొడిని 1 భాగం నీటితో కలపండి. (File image)
కలబంద సారం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శిస్తాయి, ఇవి వేడి దద్దుర్లు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. తాజాగా తీసిన కలబంద జెల్‌ని ప్రభావిత ప్రాంతంలో బాగా మసాజ్ చేయండి. 
(3 / 6)
కలబంద సారం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శిస్తాయి, ఇవి వేడి దద్దుర్లు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. తాజాగా తీసిన కలబంద జెల్‌ని ప్రభావిత ప్రాంతంలో బాగా మసాజ్ చేయండి. (Pixabay)
ముల్తానీ మట్టి అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఇది వేడి దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది. ½ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో  నీటిని కలిపి, పేస్ట్ లాగా చేయండి. ప్రభావిత ప్రాంతం అంతటా పూయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడిగేసుకోండి. 
(4 / 6)
ముల్తానీ మట్టి అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఇది వేడి దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది. ½ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో  నీటిని కలిపి, పేస్ట్ లాగా చేయండి. ప్రభావిత ప్రాంతం అంతటా పూయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడిగేసుకోండి. (Pinterest)
తులసి మంట నిరోధక చర్యలను ప్రదర్శిస్తుంది, ఇది చికాకు, ఎరుపు, వాపును తగ్గిస్తుంది, మంటలను తగ్గిస్తుంది. వేడి దద్దుర్ల దురదను తగ్గిస్తుంది. కొన్ని తులసి ఆకులను తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి దద్దుర్లు ఉన్న చోట రాయండి. 
(5 / 6)
తులసి మంట నిరోధక చర్యలను ప్రదర్శిస్తుంది, ఇది చికాకు, ఎరుపు, వాపును తగ్గిస్తుంది, మంటలను తగ్గిస్తుంది. వేడి దద్దుర్ల దురదను తగ్గిస్తుంది. కొన్ని తులసి ఆకులను తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి దద్దుర్లు ఉన్న చోట రాయండి. (Pixabay )
వేడి దద్దుర్లు నివారించడానికి, చల్లగా, పొడిగా ఉండండి.  వదులైన దుస్తులను ధరించడం, టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం, తరచుగా నీళ్లు చల్లుకోవడం,  హైడ్రేటెడ్‌గా ఉండటం ద్వారా అధిక చెమటను నివారించండి.
(6 / 6)
వేడి దద్దుర్లు నివారించడానికి, చల్లగా, పొడిగా ఉండండి.  వదులైన దుస్తులను ధరించడం, టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం, తరచుగా నీళ్లు చల్లుకోవడం,  హైడ్రేటెడ్‌గా ఉండటం ద్వారా అధిక చెమటను నివారించండి.(Freepik )

    ఆర్టికల్ షేర్ చేయండి