తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Food Places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

31 January 2024, 19:37 IST

Best food places: ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన, అత్యుత్తమ ఆహార పదార్ధాలు లభించే 100 నగరాల జాబితాలో భారత్ కు చెందిన 5 సిటీలు స్థానం సంపాదించాయి. అవి ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో.

  • Best food places: ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన, అత్యుత్తమ ఆహార పదార్ధాలు లభించే 100 నగరాల జాబితాలో భారత్ కు చెందిన 5 సిటీలు స్థానం సంపాదించాయి. అవి ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో.
ప్రఖ్యాత ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ (TasteAtlas)  స్థానిక వంటకాలను ఆస్వాదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 నగరాల జాబితాను రూపొందించింది. Google రెస్టారెంట్ రేటింగ్‌ ల ఆధారంగా ఈ లిస్ట్ ను రూపొందించారు. ఈ 100 నగరాల జాబితాలో భారత్ కు చెందిన ఐదు నగరాలు స్థానం సంపాదించాయి.
(1 / 6)
ప్రఖ్యాత ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ (TasteAtlas)  స్థానిక వంటకాలను ఆస్వాదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 నగరాల జాబితాను రూపొందించింది. Google రెస్టారెంట్ రేటింగ్‌ ల ఆధారంగా ఈ లిస్ట్ ను రూపొందించారు. ఈ 100 నగరాల జాబితాలో భారత్ కు చెందిన ఐదు నగరాలు స్థానం సంపాదించాయి.(Unsplash)
Lucknow: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం లక్నో, సంప్రదాయ, రుచికరమైన వంటకాలకు ఈ నగరం ప్రసిద్ధి. ఇక్కడి అవధి వంటకాలు చాలా ఫేమస్. ఈ వంటకాలు గొప్ప రుచులకు ప్రసిద్ధి చెందాయి. కబాబ్‌లు, బిర్యానీలు, కోర్మాస్ వంటి వంటకాలు లక్నోకు ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
(2 / 6)
Lucknow: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం లక్నో, సంప్రదాయ, రుచికరమైన వంటకాలకు ఈ నగరం ప్రసిద్ధి. ఇక్కడి అవధి వంటకాలు చాలా ఫేమస్. ఈ వంటకాలు గొప్ప రుచులకు ప్రసిద్ధి చెందాయి. కబాబ్‌లు, బిర్యానీలు, కోర్మాస్ వంటి వంటకాలు లక్నోకు ప్రత్యేకతను తీసుకువచ్చాయి.(File Photo)
New Delhi: భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీ. ఈ నగరం విభిన్నమైన రుచులకు ఫేమస్. అటు సంప్రదాయ రుచులు, ఇటు గ్లోబల్ డిషెస్ కు ఈ నగరం ప్రసిద్ధి. ఈ నగరం స్ట్రీట్ ఫుడ్ కు ప్రసిద్ధి చెందింది, గోల్ గప్పాస్, పాప్డీ చాట్, ఆలూ టిక్కీ వంటి ఐకానిక్ వంటకాలు స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తాయి. టేస్ట్ అట్లాస్ జాబితాలో న్యూఢిల్లీ 56 వ ర్యాంక్ సాధించింది.
(3 / 6)
New Delhi: భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీ. ఈ నగరం విభిన్నమైన రుచులకు ఫేమస్. అటు సంప్రదాయ రుచులు, ఇటు గ్లోబల్ డిషెస్ కు ఈ నగరం ప్రసిద్ధి. ఈ నగరం స్ట్రీట్ ఫుడ్ కు ప్రసిద్ధి చెందింది, గోల్ గప్పాస్, పాప్డీ చాట్, ఆలూ టిక్కీ వంటి ఐకానిక్ వంటకాలు స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తాయి. టేస్ట్ అట్లాస్ జాబితాలో న్యూఢిల్లీ 56 వ ర్యాంక్ సాధించింది.(Instagram/@sinfullyspicy)
Chennai: భారత్ లో దక్షిణాది రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై. ఈ నగరం చేపలు, రొయ్యల మసాలా వంటి సముద్ర ఆహారానికి కూడా ప్రసిద్ధి. బ్రేక్ ఫాస్ట్ స్పెషల్ ఇడ్లీ, దోశ, సాంబార్ తో పాటు ఈవినింగ్ స్నాక్ బజ్జీ, బోండా వంటి స్నాక్స్ కు చెన్నై ఫేమస్. టేస్ట్ అట్లాస్ జాబితాలో చెన్నై ర్యాంక్ 65.
(4 / 6)
Chennai: భారత్ లో దక్షిణాది రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై. ఈ నగరం చేపలు, రొయ్యల మసాలా వంటి సముద్ర ఆహారానికి కూడా ప్రసిద్ధి. బ్రేక్ ఫాస్ట్ స్పెషల్ ఇడ్లీ, దోశ, సాంబార్ తో పాటు ఈవినింగ్ స్నాక్ బజ్జీ, బోండా వంటి స్నాక్స్ కు చెన్నై ఫేమస్. టేస్ట్ అట్లాస్ జాబితాలో చెన్నై ర్యాంక్ 65.(File Photo)
Mumbai: ముంబయి కూడా స్ట్రీట్ ఫుడ్ కు ఫేమస్. ముంబై అనగానే గుర్తొచ్చే స్ట్రీట్ ఫుడ్ వడ పావ్, ఇది ముంబై నగరపు ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్‌, చట్నీలతో కూడిన పావ్‌లో స్పైసీ బంగాళాదుంప వడలను వేసి దీన్ని తయారు చేస్తారు. ముంబైలో మరో ఫేమస్ ఫుడ పావ్ భాజీ. ఇందులో వెన్నతో చేసిన పావ్‌తో స్పైసీ వెజిటబుల్ మాష్ ఉంటుంది. టేస్టీ అట్లాస్ జాబితాలో ముంబై ర్యాంక్ 35.
(5 / 6)
Mumbai: ముంబయి కూడా స్ట్రీట్ ఫుడ్ కు ఫేమస్. ముంబై అనగానే గుర్తొచ్చే స్ట్రీట్ ఫుడ్ వడ పావ్, ఇది ముంబై నగరపు ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్‌, చట్నీలతో కూడిన పావ్‌లో స్పైసీ బంగాళాదుంప వడలను వేసి దీన్ని తయారు చేస్తారు. ముంబైలో మరో ఫేమస్ ఫుడ పావ్ భాజీ. ఇందులో వెన్నతో చేసిన పావ్‌తో స్పైసీ వెజిటబుల్ మాష్ ఉంటుంది. టేస్టీ అట్లాస్ జాబితాలో ముంబై ర్యాంక్ 35.(File Photo)
Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.
(6 / 6)
Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.(File Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి