తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆల్కహాల్ హ్యాంగోవర్‌కు 5 వంటింటి చిట్కాలతో ఉపశమనం

ఆల్కహాల్ హ్యాంగోవర్‌కు 5 వంటింటి చిట్కాలతో ఉపశమనం

24 October 2023, 18:02 IST

రాత్రిపూట ఎక్కువగా ఆల్కహాల్ తాగుతున్నారా? ఉదయం లేవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 చిట్కాలు మీకు విశ్రాంతినిస్తాయి. ఏం చేయాలో చూడండి.

  • రాత్రిపూట ఎక్కువగా ఆల్కహాల్ తాగుతున్నారా? ఉదయం లేవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 చిట్కాలు మీకు విశ్రాంతినిస్తాయి. ఏం చేయాలో చూడండి.
చాలా మంది పండగలు, సెలవుల్లో రాత్రంతా మద్యం సేవించాలని ప్లాన్ చేస్తారు. కానీ మరుసటి రోజు నుంచి ఆఫీస్ తెరుచుకుంటుందని పెద్ద భయం. కాబట్టి వీలైనంత మితంగా మద్యం తీసుకోవాలి. లేదంటే పూర్తిగా మానేయాలి. ఎక్కువగా తాగితే హాంగోవర్ తప్పదు. మరుసటి రోజు పనిచేయడం అసలే కుదరదు. ఆల్కహాల్ హాంగోవర్ తగ్గించడానికి ఈ 5 చిట్కాలు తెలుసుకోండి.
(1 / 6)

ఎక్కువ నీరు త్రాగాలి. ఎందుకంటే ఆల్కహాల్ తాగినప్పుడు, మూత్రం ద్వారా అదనపు నీరు శరీరం నుండి వెళ్లిపోతుంది. వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితిలో డీహైడ్రేషన్ చాలా సాధారణం. కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లు తాగండి. 
(2 / 6)

మద్యం దుష్ప్రభావాలు వదిలించుకోవడానికి మీరు నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఉదయాన్నే గ్లాసు వేడి నీళ్లలో 1 నిమ్మకాయ పిండి రసం కలుపుకుని తాగితే తలనొప్పి బాగా తగ్గినట్లే. 
(3 / 6)

అల్లం టీ హ్యాంగోవర్‌ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆల్కహాల్ లోని టాక్సిన్స్ ను నాశనం చేస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి చాలా వేడిగా ఉండే అల్లం టీ తాగండి. 
(4 / 6)

కొబ్బరి నీళ్లతో ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఒక్కసారిగా ఫ్రెష్ అయిపోతారు. 
(5 / 6)
కొబ్బరి నీళ్లతో ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఒక్కసారిగా ఫ్రెష్ అయిపోతారు. (Pixabay)
మీరు ముందు రోజు రాత్రి మద్యం సేవిస్తే, మరుసటి రోజు నిద్రలేచి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవాలి. మీరు ఖాళీ కడుపుతో ఉంటే వాంతులు ఎక్కువగా ఉంటాయి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి