తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  టెక్స్ వెంచర్ ఫండ్ స్కీమ్ : వస్త్ర సంబంధ పరిశ్రమల స్టార్టప్‌లకు చేయూత

టెక్స్ వెంచర్ ఫండ్ స్కీమ్ : వస్త్ర సంబంధ పరిశ్రమల స్టార్టప్‌లకు చేయూత

03 January 2022, 20:09 IST

    • టెక్స్ వెంచర్ ఫండ్ స్కీమ్‌ను భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) అమలు చేస్తోంది.
    • విద్యుత్ మగ్గాలు, సంబంధిత టెక్స్‌టైల్ విభాగాల అభివృద్ధికి సహకారం అందించడం ఫండ్ ప్రధాన ఉద్దేశం.
టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)
టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)

Tex venture fund scheme భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) అమలు చేసే టెక్స్ వెంచర్ ఫండ్ స్కీమ్‌ ద్వారా విద్యుత్ మగ్గాలు, సంబంధిత టెక్స్‌టైల్ విభాగాల అభివృద్ధికి రుణాలు తీసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఒక ఎంటర్‌ప్రైజ్ ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి వీలుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్ తరపున SIDBI వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్(SVCL) ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెడుతుంది.

టెక్స్ ఫండ్ ఎలా ఉపయోగపడుతుంది?

టెక్స్‌టైల్ పరిశ్రమ, అనుబంధిత ఉత్పత్తులు, సేవల్లో నూతన, అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో పెట్టుబడి కోసం ఈ ఫండ్ ఉపయోగించాలి.

రూ. 3 కోట్ల వరకు వ్యయం కాగల ప్రాజెక్టులో గరిష్టంగా 50% ఎస్వీసీఎల్ పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడులు సాధారణంగా సృజనాత్మక ప్రైవేట్ విద్యుత్ మగ్గాల సంస్థల్లో ఉంటాయి.

పెట్టుబడులు టెక్స్‌టైల్ సూక్ష్మ, చిన్న స్థాయి సంస్థల్లోకి ఈక్వెటీ షేర్‌, ఈక్విటీలోకి మార్చుకోగల సాధనాల రూపంలో ఉంటాయి.

టెక్స్ ఫండ్ పొందేందుకు అర్హతలేంటి?

మంచి మేనేజ్‌మెంట్ బృందం గల విద్యుత్ మగ్గాలు, టెక్స్‌టైల్ సంబంధిత వ్యాపార సంస్థల్లో సృజనాత్మక వ్యాపార విధానంలో ఎస్వీసీఎల్ పెట్టుబడి పెడుతుంది.

ప్రాజెక్ట్‌లు కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను లేదా సృజనాత్మక వ్యాపార విధానాన్ని కలిగి ఉండాలి.

అలాగే వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించే వాటికి ప్రాధాన్యత లభిస్తుంది.

ఎస్‌వీసీఎల్ మంచి పనితీరు ట్రాక్ రికార్డ్ గల సంస్థలకు ప్రాధాన్యత ఇస్తుంది. అత్యధిక అభివృద్ధి రేట్లను కొనసాగించే సామర్థ్యం గల బిజినెస్‌లలో పెట్టుబడి పెడుతుంది.

టెక్స్ ఫండ్ ద్వారా సాయం కోసం సిడ్బీ అధికారిక వెబ్ సైట్, స్టార్టప్ ఇండియా వెబ్ సైట్‌లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

 

తదుపరి వ్యాసం