PAN Card Correction: పాన్ కార్డు కరెక్షన్ చేయాలా? కొత్త కార్డు కావాలా?
28 February 2024, 15:43 IST
- Pan Card Correction: పాన్ కార్డులో పేరు, చిరునామా, ఇతరత్రా కరెక్షన్లు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అలాగే ఆన్‌లైన్‌లో ఇప్పుడు మీరు ఐదు పది నిమిషాల్లో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు.
ఆన్‌లైన్ పాన్ దరఖాస్తు ఫారం
గూగుల్‌లో ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ అని కొడితే ఆన్‌లైన్ సర్వీసెస్ అందించే ఎన్‌ఎస్‌డీఎల్ సంబంధిత వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేసి ఆప్లై ఆన్‌లైన్ బటన్ నొక్కాలి.
ఆ తరువాత చేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డు ఆర్ రీప్రింట్ ఓల్డ్ కార్డ్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
కొత్తగా పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు న్యూ పాన్ కార్డు ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
తదుపరి ఇండివిడ్యువల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది.
అందులో దరఖాస్తుదారుడి పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేజీ నింపి సబ్మిట్ చేయగానే పాన్ అప్లికేషన్ టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మన మెయిల్ ఐడీకి కూడా వస్తుంది.
ఈ కేవైసీ ద్వారా..
రెండో పేజీకి వెళ్లాక.. మీకు ఇప్పటికే ఆధార్ కార్డు ఉంటే పేపర్‌లెస్ ఆప్షన్ ఈ–కేవైసీ ఎంచుకుని మిగిలిన వివరాలు పూరించాలి. లేదంటే ఫిజికల్ ఎంచుకోవచ్చు.
ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కావాలనుకుంటే అక్కడ ఉండే ఆప్షన్ ఎంచుకోవచ్చు. లేదంటే కొత్త చిరునామా అయితే తగిన ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం ఆన్‌లైన్‌లో రూ. 106.90 చెల్లించాల్సి ఉంటుంది. చివరగా ఈకేవైసీ ద్వారా ఆధార్ అథంటికేట్ చేయాల్సి ఉంటుంది. అంతే.. మీ కొత్త పాన్ కార్డు మీ చిరునామాకు వస్తుంది.
ఫిజికల్ రూపంలో అయితే..
ఈకేవైసీ రూపంలో కాకుండా ఫిజికల్ రూపంలో అయితే చివరగా రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డు అన్న డాక్యుమెంట్ వస్తుంది.
దీనికి పాస్ వర్డ్ మీ పుట్టిన తేదీని స్లాష్ లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ పుట్టిన తేదీ జనవరి 15, 2001 అయితే 15012001 అని టైప్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది.
దానిని డౌన్ లోడ్ చేసి వివరాలు నింపి అందులో సూచించిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
టాపిక్