ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు... రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి?
24 January 2022, 21:50 IST
- నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం 2015 నుండి కొనసాగుతుంది. అలాగే ఈ రోజునే జాతీయ న్యాయ దినోత్సవాన్ని (National Law Day) కూడా జరుపుకుంటారు. భారత రాజ్యాంగ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి..?నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగ దినోత్సవం (indian constitution day): ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న విషయం అందరకీ తెలిసిందే. 2015 నుండి ఆ సంప్రదాయం కొనసాగుతుంది. అలాగే ఈ రోజునే జాతీయ న్యాయ దినోత్సవాన్ని (National Law Day) కూడా జరుపుకుంటారు. భారత రాజ్యాంగ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత రాజ్యాంగం అమలు
1947 ఆగస్టు 15న భారత స్వాతంత్య్రం తర్వాత పీల్చిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాణం కోసం చాలా కసరత్తులు జరిగాయి. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అంబేడ్కర్ సారథ్యంలో కమిటీ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది. అనేక మేథోమధనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించారు. 1949 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. రెండు నెలలు తర్వాత 1950 జనవరి 26న భారతదేశ మెుదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ రోజు నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ దినోత్సవం
2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబరు 19న కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతకుముందు ప్రతి ఏటా ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా మాత్రమే జరుపుకునేవారు. 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎమ్. సింఘ్వి సూచన మేరకు ఆ రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు.
ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు..
భారత ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం లభించేలా.. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను ప్రజలకు రక్షణ కవచాలుగా మార్చారు. జీవించే హక్కు, చట్టం అందరికీ సమానం, రక్షణ హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి నిరోధించడం, మత స్వేచ్ఛ, అణగారిన వర్గాల రక్షణ, హక్కులకు భంగం కలిగితే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఆశ్రయించే హక్కును ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించింది.
భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు. రాజ్యాంగం అమోదించే సమయానికి దేశం 562 స్వదేశీ సంస్థానాలుగా ఉండగా.. వాటిలో ఎనిమిది మినహా మిగతావి అన్ని కూడా భారత రాజ్యంలో విలీనమయ్యాయి. 1956లో తర్వాత మిగిలిన 8 రాష్ట్రాలు పునర్నిర్మాణ చట్టం ప్రకారం విలీనమయ్యాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజల ద్వారా ఎన్నికైనా ప్రజా ప్రతినిధులతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
అన్నింటి కంటే రాజ్యాంగమే గొప్పది
దేశం, రాష్ట్రాల నిర్వహణ కోసం, కార్యనిర్వాహక వర్గం, శాసన, న్యాయ రంగాలు ఎలా ఉండాలి అనే అంశాలను కూడా వివరించారు. కార్యనిర్వాహక, శాసనస శాఖలు మిళితమై ఉంటాయి. అధ్యక్ష పాలన కాకుండా పార్లమెంట్/ శాసనసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే కార్యనిర్వాహక శాఖనూ నిర్వహిస్తారు. ముఖ్యంగా రాజ్యాంగానికి మూల స్తంభాలుగా శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలు పరస్పరం ఆధారపడుతూ వ్యవస్థను నడిపిస్తాయి.