తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Xi Jinping: జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు!

Xi Jinping: జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు!

HT Telugu Desk HT Telugu

23 October 2022, 11:04 IST

google News
  • Communist Party of China: చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా షీ జిన్‌పింగ్‌ ఎన్నికయ్యారు. ఫలితంగా మరో ఐదేళ్లు అధ్యక్ష బాధ్యతలు చూడనున్నారు. 

చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్!
చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్! (AFP)

చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్!

China’s President Xi Jinping: చైనా చరిత్రలో సరికొత్త ఘట్టానికి అడుగుపడింది. వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు షీ జిన్‌పింగ్‌ సిద్ధమయ్యారు. మరోసారి కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్ పింగ్ ఎన్నికయ్యారు. ఫలితంగా మావో జెడాంగ్ తర్వాత అత్యంత ప్రభావంతమైన నాయకుడిగా జిన్ పింగ్ నిలిచారు.

ఐదేళ్లకోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతాయి. ఇందులో భాగంగా శనివారం 205 మంది సెంట్రల్‌ కమిటీ సభ్యుల ఎన్నికతో ముగిసింది. ఆదివారం వీరంతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్ పింగ్ ను ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాలను జిన్ పింగ్ ప్రకటించారు. చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ విధేయుడిగా పేరున్న లీ కియాంగ్‌ దేశ ప్రధాని పదవి దక్కింది.

ఈ సందర్భంగా షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ "మీరు నాపై ఉంచిన నమ్మకానికి పార్టీ మొత్తానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విధి నిర్వహణలో శ్రద్ధగా పని చేస్తాను' అంటూ హామీనిచ్చారు.

మరోవైపు సెంట్రల్‌ కమిటీని భారీగా ప్రక్షాళించారు. జిన్‌పింగ్‌ తర్వాత నంబర్‌ టూగా కొనసాగుతున్న లీ కీ, డింగ్ జుగ్జియాంగ్ తో పాటు కాయ్ కీ నేతలకు ఇందులో చోటు కల్పించారు. వాంగ్ యాంగ్ (67), అవినీతి నిరోధ శాఖ చీఫ్ జావో లీజ్ (65)కు కూడా స్థానం దక్కింది. ఇందులోని సభ్యులు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌ (67), నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ లీ ఝాన్సు(72), చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ వాంగ్‌ యాంగ్‌(67), ఉప ప్రధాని హాన్‌జెంగ్‌ (68) అత్యున్నత స్థాయి స్టాండింగ్‌ కమిటీలో చోటు కోల్పోయారు.

తాజా ఫలితంతో మరో ఐదేళ్లపాటు చైనా అధ్యక్ష బాధ్యతలు చూడనున్నారు జిన్ పింగ్. మూడోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. గతంలో పార్టీలో రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే నియమం ఉండేది. అయితే 2018లో జిన్ పింగ్ ఈ నియమాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

టాపిక్

తదుపరి వ్యాసం