తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wrestler's Fir: రెజ్లర్లపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులు.. బ్రిజ్ భూషణ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు

Wrestler's FIR: రెజ్లర్లపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులు.. బ్రిజ్ భూషణ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు

HT Telugu Desk HT Telugu

02 June 2023, 14:36 IST

google News
  • రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లోని కీలక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేవాడని, వారిని అసభ్యంగా తాకేవాడని, తనకు నచ్చినట్లుగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించేవాడని రెజ్లర్లు అందులో ఆరోపించారు.

రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (ఫైల్ ఫొటో)
రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (ఫైల్ ఫొటో) (PTI)

రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (ఫైల్ ఫొటో)

రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లోని కీలక ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేవాడని, వారిని అసభ్యంగా తాకేవాడని, తనకు నచ్చినట్లుగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించేవాడని రెజ్లర్లు అందులో ఆరోపించారు. లైంగిక వేధింపులను దాదాపు అందరు మహిళా రెజ్లర్లు భరించారని వెల్లడించారు. కొన్నేళ్లుగా ఈ వేధింపులను మహిళా రెజ్లర్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పొక్సొ చట్టంలోని సెక్షన్లు కూడా

బ్రిజ్ భూషణ్ సింగ్ పై కేసు నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ పై పోలీసులు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేయడంతో తప్పనిసరై, ఢిల్లీ పోలీసులు రెజ్లర్లు లేదా వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేశారు. పోలీసులకు రెజ్లర్లు, వారి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు కొన్ని తాజాగా వెలుగులోకి వచ్చాయి. బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందనే కాకుండా, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ((POCSO)) కింద కూడా కేసు నమోదు చేశారు. దాడి, లైంగిక దాడి, నేరపూరిత బెదిరింపులు, లైంగిక వేధింపులు, అసభ్యంగా తాకడం, ప్రవర్తించడం.. మొదలైన ఆరోపణలను ఆ ఎఫ్ఐఆర్ లలో నమోదు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ సెక్రటరీ వినోద్ తోమర్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చారు.

17 ఏళ్ల బాలికపై..

2016 నుంచి రెజ్లింగ్ పోటీల్లో చురుగ్గా పాల్గొంటున్న ఒక బాలికను బ్రిజ్ భూషణ్ సింగ్ మొదట్నుంచీ లక్ష్యంగా చేసుకున్నాడని ఆ బాలిక తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారత్ లో జరిగిన ఒక పోటీలో తన కూతురు బంగారు పతకం గెలిచిందని, ఆ సమయంలో తన కూతురితో ఫొటో దిగే నెపంతో గట్టిగా దగ్గరకు లాక్కుని, ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్యంగా చేతులు వేశాడని ఆ తండ్రి ఆరోపించారు. తనకు నచ్చినట్లుగా ఉండకపోతే, భవిష్యత్ పోటీల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తానని బ్రిజ్ భూషణ్ సింగ్ తన కూతురిని బెదిరించాడని ఆయన ఆరోపించారు. కెరియర్ ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితిని తన కూతురు తట్టుకోలేకపోయిందని ఆయన వాపోయారు.

పక్కకు పిలిచి అసభ్య ప్రవర్తన..

మరో మహిళా రెజ్లర్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. బ్రిజ్ భూషణ్ సింగ్ చాలా మంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడు. తనను కూడా గత సంవత్సరం నుంచి లైంగికంగా వేధించడం ప్రారంభించాడని ఆమె ఫిర్యాదు చేశారు. ట్రైనింగ్ లో ఉండగా, తనను పక్కకు పిలిచి, అసభ్యంగా తనపై చేతులు వేసేవాడని, తన శ్వాసను పరిశీలించే నెపంతో తన పొట్టపై చేతులు వేశాడని ఆమె ఆరోపించారు. మహిళా రెజ్లర్లను గ్రూప్ నుంచి బలవంతంగా పక్కకు పిలిచి, దారుణమైన వ్యక్తిగత ప్రశ్నలు అడిగేవాడని తన ఫిర్యాదులో వివరించారు.

తదుపరి వ్యాసం