తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  World Aids Day 2022: ఎయిడ్స్ అవగాహనకు గుర్తుగా ‘రెడ్ రిబ్బన్’ ఎందుకో తెలుసా?

World AIDS Day 2022: ఎయిడ్స్ అవగాహనకు గుర్తుగా ‘రెడ్ రిబ్బన్’ ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu

01 December 2022, 16:00 IST

  • World AIDS Day 2022: చికిత్సే కాని నివారణ లేని వ్యాధి ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మందిని బాధ పెడ్తోంది. వ్యాధి చికిత్సకు మెరుగైన ఔషధాలు వచ్చాయి. కానీ, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులపై సమాజం చూపే వివక్షలో పెద్ద మార్పేమీ రాలేదు. World AIDS Day 2022: Why 'Red Ribbon' is used as a symbol for AIDS awareness?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎయిడ్స్(acquired immunodeficiency syndrome -AIDS) వ్యాధి గ్రస్తులకు సహానుభూతిగా, సంఘీభావంగా, ఎయిడ్స్ పై అవగాహనకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రెడ్ రిబ్బన్ ను ధరిస్తారు. ఎయిడ్స్(AIDS) పై అవగాహనకు 1990లలో ప్రిన్సెస్ డయానా విశేష కృషి చేశారు. పలు సందర్భాల్లో ఆమె ఈ రెడ్ రిబ్బన్ ధరించడంతో ఈ గుర్తు మరింత పాపులర్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

AIDS history: హెచ్ఐవీ సోకడం వల్ల..

హెచ్ఐవీ (human immunodeficiency virus- HI) సోకడం వల్ల ఈ ఎయిడ్స్ వస్తుంది. ఇది సాధారణంగా అసురక్షిత లైంగిక విధానాల వల్ల, ఎయిడ్స్ సోకిన వ్యక్తితో లైంగిక చర్యల వల్ల, ఎయిడ్స్(AIDS) సోకిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించడం వల్ల సోకుతుంది. ప్రస్తుతానికి ఈ వ్యాధికి చికిత్సే కానీ నివారణ లేదు. ప్రపంచ వ్యాప్తంగా 2021 చివరి నాటికి 3. 84 కోట్ల మంది ఎయిడ్స్ తో బాధ పడుతున్నారు. వీరిలో 2.56 కోట్ల మంది ఒక్క ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నారు. యూకేలో ప్రతీ సంవత్సరం కనీసం 4 వేల మందికి ఈ ప్రాణాంతక వ్యాధి సోకుతోంది.

Red Ribbon history: రెడ్ రిబ్బన్ చరిత్ర

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు సంఘీభావంగా, సహానుభూతితో, ఎయిడ్స్ పై అవగాహన కొరకు, ఎయిడ్స్(AIDS) తో మరణించిన వారికి సంతాపంగా ప్రజలు రెడ్ రిబ్బన్ ను ధరిస్తారు. అయితే, ఇందుకు రెడ్ రిబ్బన్(red ribbon) నే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు ఆసక్తికర చరిత్ర సమాధానంగా లభిస్తుంది. ఎయిడ్స్ పై అవగాహనకు ఈ రెడ్ రిబ్బన్ గుర్తును వాడడం 1988 నుంచి ప్రారంభమైంది. ఎయిడ్స్(AIDS) వ్యాధిగ్రస్తులకు ప్రేమను పంచాలన్న లక్ష్యంతో, హృదయం ఆకారంలో మలచిన రెడ్ రిబ్బన్ ను ఛాతిపై ధరించడం ప్రారంభమైంది. ప్రధానంగా రక్తం ద్వారా ఇది సోకుతున్న కారణంగా ‘రెడ్’ రిబ్బన్ (red ribbon)’ ను గుర్తుగా ఎంచుకున్నారన్న వాదన కూడా ఉంది. అలాగే, ఎయిడ్స్(AIDS) కు నివారణ లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేయడానికి రెడ్ రిబ్బన్(red ribbon) ను ఎంపిక చేశారని కూడా కొందరు వివరిస్తారు.

Red Ribbon history: కళాకారుల స్పందన

ఎయిడ్స్(AIDS) పై అవగాహన పెంచడానికి కళాకారుల సహాయం అవసరమైంది. వారు ‘విజువల్ ఎయిడ్స్’ అనే గ్రూప్ ను ప్రారంభించారు. ఎయిడ్స్(AIDS) వ్యాధి గ్రస్తులకు సంఘీభావం తెలపడానికి, వారికి మేమున్నామనే సందేశం ఇవ్వడానికి ఒక ప్రత్యేక గుర్తును రూపొందించాలని నిర్ణయించారు. అదే సమయంలో గల్ఫ్ యుద్ధంలో అమెరికా సైనికులు, యుద్ధంలో మరణించిన సహచరులకు గుర్తుగా ‘యెల్లో రిబ్బన్(yellow ribbon)’ ధరించేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎయిడ్స్ పై అవగాహనకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సంఘీభావంగా ఈ ‘రెడ్ రిబ్బన్(red ribbon)’ కు రూపకల్పన చేశారు.

టాపిక్