తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video | మృత్యువు అంచు వరకు వెళ్లిన మహిళ.. ఆ ఒక్కటే కాపాడింది!

Viral video | మృత్యువు అంచు వరకు వెళ్లిన మహిళ.. ఆ ఒక్కటే కాపాడింది!

HT Telugu Desk HT Telugu

21 March 2022, 13:46 IST

google News
    • రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణం అంచువరకు వెళ్లొచ్చింది. స్కూటీ మీద రోడ్డు దాటుతుండగా.. అతివేగంతో వస్తున్న ఓ ట్రక్కు ఆమెను ఢీకొట్టింది. ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తలకు హెల్మెట్​ ధరించడంతో ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.
వైరల్​ వీడియో
వైరల్​ వీడియో (Hindustan times)

వైరల్​ వీడియో

Road accidents in India | దేశంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారాయి. ఎవరో ఒకరి తప్పుతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరికొంత మందికి తీవ్ర గాయాలై మంచానికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే.. లక్​ అనాలో లేక దేవుడి అనుగ్రహం అనాలో కానీ.. కొంతమంది రోడ్డు ప్రమాదాలతో మరణం అంచు వరకు వెళ్లి సురక్షితంగా బయటపడుతున్నారు. కర్ణాటకలోని మనిపాల్​లో ఓ మహిళకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా.. ఓ ట్రక్కు వచ్చి అమెను ఢీకొట్టింది.

అసలేం జరిగిందంటే..

మనిపాల్​కు సమీపంలో గత మంగళవారం జరిగింది ఈ ఘటన. పేరంపల్లి పరిసరాల్లో ఓ మహిళ స్కూటీ మీద రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. కాగా ఓ లారీ వస్తోందని కొంతసేపు ఆగింది. కొన్ని క్షణాల తర్వాత.. ఆ లారీ నెమ్మదించడంతో ఈ మహిళ ముందుకు కదిలింది. ఇంతలో లారీ వెనక నుంచి అతివేగంతో వస్తున్న ఓ పాల ట్రక్కు.. మహిళ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఫలితంగా వాహనంతో పాటు ఆమె గాలిలో ఎగిరి రోడ్డు మధ్యలో పడింది. ఒళ్లుగరగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

మహిళను ఢీకొట్టిన తర్వాత ట్రక్కు ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే ఆమెవైపు పరుగులు తీశారు. ఆమెను లేపి, కుర్చీలో కూర్చోబెట్టి నీళ్లు అందించారు.

అయితే ఆ మహిళ తలకు హెల్మెట్​ పెట్టుకోవడంతో పెద్ద దెబ్బలు తగలలేదు. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది.

హెల్మెట్​ ధరించడం ఎంతో ముఖ్యమని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. ప్రాణాలకు హెల్మెట్​ రక్షణ ఇస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోను మంగళూరు సిటీ అనే ట్విట్టర్​ ఖాతా.. ట్వీట్​ చేసింది. 'హెల్మెట్​ ధరించండి.. సురక్షితంగా డ్రైవ్​ చేయండి,' అని రాసుకొచ్చింది.

ఘటనకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి:

టాపిక్

తదుపరి వ్యాసం