తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Why Gujarat Poll Dates Not Announced: గుజరాత్ షెడ్యూల్ ను ఎందుకు ప్రకటించలేదు?

Why Gujarat poll dates not announced: గుజరాత్ షెడ్యూల్ ను ఎందుకు ప్రకటించలేదు?

HT Telugu Desk HT Telugu

14 October 2022, 17:36 IST

  • Why Gujarat poll dates not announced: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించబోతోందన్న వార్త రాగానే.. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందని అంతా భావించారు. కానీ ఈసీ ఒక్క హిమాచల్ కే షెడ్యూల్ విడుదల చేసింది.

ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్
ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ (PTI)

ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్

Why Gujarat poll dates not announced: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేయకపోవడంపై ఆశ్చర్యంతో పాటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Why Gujarat poll dates not announced: 40 రోజుల తేడా..

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 18న ముగియనుంది. అలాగే, గుజరాత్ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 8వ తేదీన ముగుస్తుంది. అందువల్ల ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి, ఒకేసారి ఫలితాలను విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ, ప్రస్తుతం ఒక్క హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరుగుతాయని, ఫలితాల విడుదల డిసెంబర్ 8న ఉంటుందని వెల్లడించారు.

Why Gujarat poll dates not announced: ఫలితాల వెల్లడిలో అంత జాప్యం ఎందుకు?

అలాగే, మరో విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 12న ముగిస్తే, ఫలితాలను డిసెంబర్ 8న ప్రకటించనున్నారు. అంటే, ఎన్నికలకు, ఫలితాల విడుదలకు దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంటుంది. చిన్న రాష్ట్రమైన,కేవలం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్న కూడా వస్తోంది.

Why Gujarat poll dates not announced: ఇవే కారణాలు..

ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో విలేకరులు సీఈసీ రాజీవ్ కుమార్ ముందుంచారు. దాంతో, ఆయన వివరణ ఇచ్చారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ముగింపు గడువు లో తేడా 30 రోజుల లోపే ఉండాలని, ఇక్కడ గుజరాత్, హిమాచల్ అసెంబ్లీల ముగింపు గడువు తేడా 40 రోజులు ఉందని రాజీవ్ వివరించారు. అలాగే, ఎన్నికల నియమావళి హిమాచల్ లో 57 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటుందన్నారు.

Why Gujarat poll dates not announced: వాతావరణం కూడా..

శీతాకాలంలో హిమాచల్ ప్రదేశ్ లో మంచు కురియడం ప్రారంభమవుతుందని, ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలించదని, అందువల్ల ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలని భావించామని రాజీవ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఎన్నికల నియమాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. కాగా, 2017 ఎన్నికల సమయంలోనూ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను వేర్వేరుగా ప్రకటించారు. కానీ, ఫలితాలను మాత్రం ఒకేసారి ప్రకటించారు.

తదుపరి వ్యాసం