తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Cold And Cough Syrup Kills 66: 66 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గుమందు

Indian cold and cough syrup kills 66: 66 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గుమందు

HT Telugu Desk HT Telugu

06 October 2022, 15:29 IST

google News
  • Indian cold and cough syrup kills 66: భారత్ లో తయారైన దగ్గుమందు(cough syrup) పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల ప్రాణం పోవడానికి కారణమైంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిం

    ది.

హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ఫ్యాక్టరీ
హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ఫ్యాక్టరీ (PTI)

హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ఫ్యాక్టరీ

Indian cold and cough syrup kills 66: భారత్ కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన నాలుగు రకాల దగ్గుమందు కారణంగా గాంబియాలో దాదాపు 66 మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది.

Indian cold and cough syrup kills 66: మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్..

హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ సంస్థ ఉత్పత్తి చేసిన నాలుగు రకాలు దగ్గు మందులను వాడిన పిల్లలు చనిపోయినట్లు తేలింది. అవి Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup లుగా నిర్ధారించారు. ప్రస్తుతానికి గాంబియాలో వాటి వాడకాన్ని నిలిపేశారు. ఈ కాఫ్ సిరప్ ల్లో ప్రాణాంతక diethylene glycol and ethylene glycol లు ప్రమాదరకర స్థాయిలో ఉన్నాయని నిర్ధారించారు.

Indian cold and cough syrup kills 66: ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్

గాంబియాలో భారతీయ కాఫ్ సిరప్ ను వినియోగించిన చిన్న పిల్లలు చనిపోవడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై స్పందించింది. ఈ విషయమై భారత్ లోని ఔషధ నియంత్రణ సంస్థతో, భారత ప్రభుత్వంతో, ఆ కాఫ్ సిరప్ లను ఉత్పత్తి చేసిన మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ప్రతినిధులకు తమ ఆందోళనను తెలిపామని WHO వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఆ నాలుగు కాఫ్ సిరప్ లకు సంబంధించి భద్రత ప్రమాణాల వివరాలను మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ WHO కు అందించలేదని ఆ సంస్థ డీజీ టెడ్రోస్ వెల్లడించారు.

Indian cold and cough syrup kills 66: వేరే దేశాల్లోనూ..

వేరే దేశాల్లోనూ ఈ దగ్గు మందు చెలామణిలో ఉండవచ్చని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే, ఈ విషయంలో అన్ని దేశాలను, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలను అప్రమత్తం చేశామన్నారు. వెంటనే వాటిని చెలమణి లో నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలను కోరామన్నారు. ఈ దగ్గుమందులు భద్రతా ప్రమాణాలకు లోబడి లేవని, వీటి వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని సెప్టెంబర్ నెలలోనే WHO కు సమాచారం అందింది.

తదుపరి వ్యాసం