తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Whatsapp Tricks: వాట్సాప్ లో డిలీటెడ్ మెస్సేజెస్ చదవడం ఎలా?

WhatsApp tricks: వాట్సాప్ లో డిలీటెడ్ మెస్సేజెస్ చదవడం ఎలా?

HT Telugu Desk HT Telugu

30 September 2022, 22:03 IST

    • WhatsApp tricks: వాట్సాప్ ఇప్పుడు నిత్యావసరమైంది. దాదాపు అందరూ ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు చెక్ చేసుకునే యాప్ అదే. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో వినియోగదారులకు వాట్సాప్ దగ్గరవుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp tricks: సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటోంది. డేటా ఉంటే చాలు, ప్రపంచంలోని ఎవరితో అయినా వాయిస్ కాల్, వీడియో కాల్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, కాంటాక్ట్స్ షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ పే ఆప్షన్ తో ఇప్పుడు ఈ యాప్ నుంచే డబ్బులు పంపించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

WhatsApp tricks: డిలీటెడ్ మెస్సేజెస్..

సాధారణంగా మెసేజ్ పంపించిన తరువాత, పొరపాటుగా పంపించడం వల్లనో, పంపించకూడదని భావించడం వల్లనో ఆ మెసేజ్ ను డిలీట్ చేస్తాం. అలాగే, వేరే వారు కూడా మనకు పంపిన, అనవసరం అనుకున్న మెసేజెస్ డిలీట్ చేస్తుంటారు. అయితే, సమస్య ఏంటంటే, డిలీట్ చేసిన విషయం డిలీటెడ్ మెసేజ్ రూపంలో ఎదుటి వ్యక్తికి తెలిసిపోతుంది. అప్పుడు, ఆ మెసేజ్ ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి సాధారణంగా నెలకొంటుంది. వారి కోసమే ఈ ట్రిక్..

WhatsApp tricks: థర్డ్ పార్టీ యాప్

వేరే వారు మనకు పంపించి, మనం చదవక ముందే డిలీట్ చేసిన మెసేజ్ ను చదివే అవకాశం ఉంది. అందుకు మనం చేయాల్సిందల్లా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక థర్డ్ పార్టీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడమే.

WhatsApp tricks: డిలీటెడ్ మెసేజెస్ ఇలా చదివేయండి..

డిలీటెడ్ మెసేజెస్ ను చదవడం కోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్ ”Get Deleted Messages” ను డౌన్ లోడ్ చేసుకుని, ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

  • ఆ తరువాత ఆ యాప్ కు కొన్ని పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది. మీ వాట్సాప్ లో మీకు ఏదైనా మెసేజ్ వచ్చి, అది మీరు చూడకముందే డిలీట్ అయితే, ఆ మెసేజ్ ను, అది మీ ఫోన్ కు రాగానే ఈ యాప్ సేవ్ చేసుకుని ఉంటుంది.
  • అనంతరం ఈ ”Get Deleted Messages” యాప్ ను ఓపెన్ చేసి మీరు మీకు వచ్చిన డిలీటెడ్ మెసేజెస్ ను చదువుకోవచ్చు.
  • ఈ యాప్ కు పర్మిషన్ వద్దు అనుకంటే ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మీరు పర్మిషన్లను తొలగించవచ్చు.