VITEEE 2025 : వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
05 November 2024, 17:55 IST
- VITEEE 2025 registrations : వీఐటీఈఈఈ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? చివరి తేదీ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వీఐటీఈఈఈ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)లో B.tech ప్రవేశాల కోసం వీఐటీఈఈఈ పరీక్షను నిర్వహిస్తారు. కాగా వీఐటీఈఈ 2025 పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు viteee.vit.ac.in వీఐటీఈఈ అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 మార్చి 2025 అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
వీఐటీఈఈఈ 2025 దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2025 ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు వీఐటీఈఈ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. మరోవైపు 2025 ఏప్రిల్ 30న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌన్సెలింగ్ ప్రక్రియను 2025 మేలో ప్రారంభమవుతుందని సమాచారం.
వీఐటీఈఈ పరీక్షకు అర్హత..
- రెసిడెంట్/ నాన్ రెసిడెంట్ ఇండియన్ నేషనల్/ ఓసీఐ/ పీఐఓ హోల్డర్ అయి ఉండాలి.
- పుట్టిన తేదీ 2003 జూలై 1 లేదా ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులు.
- కౌన్సెలింగ్ సమయంలో వయస్సు రుజువుగా ఒరిజినల్లో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.
- హైస్కూల్/ ఎస్ఎస్సీ/ ఎక్స్ సర్టిఫికేట్లో నమోదైన పుట్టిన తేదీ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది.
విద్యార్హతలు:
అభ్యర్థులు 2025లో ఈ క్రింది వాటిలో ఏదో ఒక అర్హత పరీక్షను పూర్తి చేసి ఉండాలి లేదా హాజరవుతూ ఉండాలి:
- ఏదైనా గుర్తింపు పొందిన కేంద్ర/ రాష్ట్ర బోర్డు నిర్వహించే 10+2 విధానం తుది పరీక్ష.
- ఇంటర్మీడియట్ లేదా గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం నిర్వహించే రెండేళ్ల ప్రీ-యూనివర్శిటీ పరీక్ష.
- అడ్వాన్స్డ్ (ఏ) స్థాయిలో జనరల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ (జీసీఈ) పరీక్ష (లండన్ /కేంబ్రిడ్జ్ /శ్రీలంక).
- కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం హైస్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ లేదా జెనీవాలోని ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్ ఆఫీస్ ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్ డిప్లొమా (ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ - హెచ్ఎల్, కెమిస్ట్రీ - ఎస్ఎల్).
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నిర్వహించే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్లో సెంట్రల్ బోర్డ్ గుర్తింపు పొందిన విధంగా కనీసం 5 సబ్జెక్టులతో ఉత్తీర్ణత సాధించాలి.
భారతదేశం వెలుపల 12వ తరగతి (లేదా తత్సమాన) పరీక్షను పూర్తి చేసిన దరఖాస్తుదారులు తాము ఉత్తీర్ణత సాధించిన పరీక్ష గ్రేడ్ / సీజీపీఏ శాతంగా మార్చిన 12 వ తరగతి పరీక్షకు సమానమైనదని సమానత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
ఒకే విద్యా సంవత్సరంలో పలు బోర్డు పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వీఐటీఈఈఈ 2025కు అనర్హులు.
ప్రకృతి వైపరీత్యాలు లేదా సంస్థ నియంత్రణకు మించిన కారణాల వల్ల వీఐటీఈఈఈఈ 2025 రద్దైతే, అర్హత ప్రమాణాల స్థానంలో హయ్యర్ సెకండరీ మార్కులను చేర్చవచ్చని గుర్తుపెట్టుకోవాలి.
వీఐటీఈఈఈ 2025: దరఖాస్తు విధానం..
- viteee.vit.ac.in అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.
- హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ విభాగానికి వెళ్లి అడిగిన వివరాలు చెప్పండి.
- లాగిన్ చేయడానికి అవసరమైన ఆధారాలను నమోదు చేయండి.
- వీఐటీఈఈఈ 2025 అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
- అన్ని వివరాలను ధృవీకరించండి. ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేయండి.
- భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింటౌట్ తీసుపెట్టుకోండి.
వీఐటీఈఈ 2025కి సంబంధించిన మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని సూచించారు.