తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Virus News | వైర‌స్ సోకితే మీ వాస‌న మారుతుంది!

Virus News | వైర‌స్ సోకితే మీ వాస‌న మారుతుంది!

HT Telugu Desk HT Telugu

13 July 2022, 20:48 IST

google News
  • Virus News | సాధార‌ణంగా వివిధ ర‌కాల వైర‌స్‌లు సోకిన‌ప్పుడు వివిధ ర‌కాలైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే, ఏ వైర‌స్ సోకినా.. కొన్ని సాధార‌ణ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిలో జ్వ‌రం, ఒళ్లు నొప్పులు ప్ర‌ధానం. అయితే, మ‌రో సాధార‌ణ ల‌క్ష‌ణాన్ని కూడా ప‌రిశోధ‌కులు ఈ మ‌ధ్య గుర్తించారు.

వైర‌స్‌
వైర‌స్‌

వైర‌స్‌

Virus News | వైర‌స్‌ల వ్యాప్తిలో దోమ‌లు చాలా కీల‌కం. వైర‌స్ సోకిన వ్య‌క్తిని కుట్టిన దోమ‌.. ఆరోగ్యంగా ఉన్న మరో వ్య‌క్తిని కుట్టిన‌ప్పుడు.. ఆ వైర‌స్ ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తిలోకి చేరుతుంది. అయితే, దోమ‌లు వైర‌స్ సోకిన వ్య‌క్తిని అత‌డి వ‌ద్ద నుంచి వ‌చ్చే వాస‌న ద్వారా గుర్తించి, ఆక‌ర్షితుల‌వుతాయ‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించారు. దోమ‌లు చాలా డేంజ‌ర‌స్. దోమ‌కాటు వ‌ల్ల వచ్చే వ్యాధుల‌తో ఏటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల మంది చ‌నిపోతుంటారు. ఈ వ్యాధుల్లో ప్ర‌ధాన‌మైన‌వి మ‌లేరియా, యెల్లో ఫీవ‌ర్‌, డెంగ్యూ, జికా, చికన్‌గున్యా.

Virus News | వాస‌న‌తో..

ఏదైనా వైర‌స్ సోకిన వ్య‌క్తి నుంచి ప్ర‌త్యేక‌మైన వాస‌న వ‌స్తుంద‌ని, ఆ వాస‌న దోమ‌ల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించారు. ఎలుక‌పై చేసిన ప్ర‌యోగాల ద్వారా ఈ విష‌యాన్ని నిర్ధారించారు. డెంగ్యూ వైర‌స్ సోకిన ఎలుక‌ను, ఏ వైర‌స్ సోక‌ని మ‌రో ఎలుక‌ను ఒక గాజు బోనులో ఉంచారు. అందులోకి దోమ‌ల‌ను వ‌దిలారు. మెజారిటీ దోమ‌లు వైర‌స్ సోకిన ఎలుక‌వైపే వెళ్లాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌త స‌హా మిగతా అన్ని పారామీట‌ర్లు ఆ రెండు ఎలుక‌ల్లోనూ స‌మానంగా ఉండేలా చూశారు. దీన్ని బ‌ట్టి వైర‌స్ సోకిన ఎలుక నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక‌మైన వాస‌న దోమ‌ల‌ను ఆక‌ర్షించిన‌ట్లు గుర్తించారు.

Virus News | అసిటోఫెనాన్

ఆ వాస‌న‌ను అరిక‌ట్ట‌డం ద్వారా కూడా దోమ కాటును త‌గ్గించ‌వ‌చ్చ‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అలాగే, ఆ త‌రువాత‌, అదే బోనులో ఎలుకల నుంచి వ‌చ్చే వాస‌న‌ను అడ్డుకునే ఫిల్ట‌ర్ల‌ను ఉంచారు. అప్పుడు, రెండు ఎలుక‌ల వైపు దాదాపు స‌మాన సంఖ్య‌లో ఎలుక‌లు వెళ్లాయి.ఇలా దోమ‌కాటులో, త‌ద్వారా వైర‌స్ వ్యాప్తిలో వాస‌న ప్రాముఖ్య‌త‌ను నిర్ధారించారు. త‌ద‌నంత‌ర ప‌రిశోధ‌న‌ల్లో అసిటోఫెనాన్(acetophenone) కెమిక‌ల్ కంపౌండ్ ఉన్న వాస‌న దోమ‌ల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తున్న‌ట్లు గుర్తించారు.

తదుపరి వ్యాసం