తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us School Shooting: స్కూల్‍లో ఆరుగురిని చంపిన దుండగుడిని పోలీసులు ఎలా కాల్చేశారంటే!: వీడియో విడుదల

US School Shooting: స్కూల్‍లో ఆరుగురిని చంపిన దుండగుడిని పోలీసులు ఎలా కాల్చేశారంటే!: వీడియో విడుదల

29 March 2023, 8:18 IST

  • US School Shooting: పాఠశాలలో కాల్పులు జరిపి ఆరుగురిని చంపిన దుండగుడిని ఏ విధంగా మట్టుబెట్టింది ఓ వీడియోను పోలీసులు వెల్లడించారు. బాడీ క్యామ్ ఫొటేజీని విడుదల చేశారు.

US School Shooting: దుండగుడిని పోలీసులు ఎలా మట్టుబెట్టారంటే.. (Photo: Nashville Police)
US School Shooting: దుండగుడిని పోలీసులు ఎలా మట్టుబెట్టారంటే.. (Photo: Nashville Police)

US School Shooting: దుండగుడిని పోలీసులు ఎలా మట్టుబెట్టారంటే.. (Photo: Nashville Police)

US School Shooting: తుపాకులతో స్కూల్‍లోకి ప్రవేశించిన ఓ మాజీ స్టూడెంట్ పాఠశాలలో మారణహోమం చేశాడు. ముగ్గురు విద్యార్థులు సహా మొత్తంగా ఆరుగురిని కాల్చి చంపాడు. అమెరికాలోని నాష్‍విల్లే (Nashville)లో సోమవారం ఈ ఘటన జరిగింది. అయితే, ఈ దురాగతానికి పాల్పడిన నిందితుడిని ఎలా ముట్టుబెట్టారో వీడియో ద్వారా నాష్‍విల్లే పోలీసులు వెల్లడించారు. వీడియో ఫుటేజీని విడుదల చేశారు. బాడీ కెమెరా ఫుటేజీని నాష్‍విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కాల్పులకు పాల్పడిన ఆడ్రే హేల్ (28)ను పోలీసులు ఎలా అంతం చేశారో ఈ వీడియోలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

ఆపరేషన్ జరిగిందిలా..

US School Shooting: దుండగుడు మొదటి ఫ్లోర్‌లో ఉన్నాడని పోలీస్ ఆఫీసర్లకు టీచర్లు చెప్పారు. ఆఫీసర్ మైకేల్ కోల్లాజో నేతృత్వంలో నాష్‍విల్లే పోలీసులు ఈ ఆపరేషన్ చేశారు. దాడికి పాల్పడిన దుండగుడి వైపుగా పోలీసులు క్రమంగా వెళ్లారు. గన్ కాల్చిన సౌండ్ వినపడటంతో పోలీసులు వెంటనే ఆ దిశగా పరుగెత్తారు. హాల్‍లో ఉన్న దుండగుడిపై కాల్పులు జరిపారు. దాదాపు తొమ్మిదిసార్లు నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. “కదలడం ఆపెయ్. గన్ వదిలెయ్. నిందితుడు కప్పకూలాడు” అని పోలీసులు అనడం వీడియోలో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజీని నాష్‍విల్లే పోలీసు డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

ఎలా ఎంటర్ అయ్యాడంటే..

US School Shooting: రెండు రైఫిళ్లు, హ్యాండ్‍ గన్‍తో నాష్‍విల్లే స్కూల్‍లోకి ఆడ్రే హేల్ సోమవారం ప్రవేశించాడు. ముందుగా స్కూల్ ఫ్రంట్ డోర్లపై కాల్పులు జరిపాడు. భయానక వాతావరణం సృష్టించాడు. ఆ తర్వాత స్కూల్‍లో తుపాకీ పట్టుకొని తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది.

US School Shooting: ఈ కాల్పుల్లో మొత్తంగా ఆరుగురు చనిపోయారు. 9 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు, 8 ఏళ్ల పిల్లాడు ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు సిబ్బంది కూడా చనిపోయారు. వారి వయసు 60 నుంచి 61 ఏళ్ల మధ్య ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

US Shooting: అమెరికాలో కాల్పుల ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మరీ ఎక్కువైపోయింది. నలుగురు అంత కంటే ఎక్కువ మంది చనిపోయిన కాల్పుల ఘటనలు సంవత్సర కాలంలోనే 129 జరిగాయి. గన్ వయిలెన్స్ ఆర్చీవ్స్ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.

కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న రకం ఆయుధాలను నిషేధించేలా చట్టం చేయాల్సి ఉందని అన్నారు.