తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Issues ‘One Million’ Visas: ఇండియన్స్ కు ఇప్పటివరకు 10 లక్షల వీసాలు; అమెరికా రికార్డు

US issues ‘ONE MILLION’ visas: ఇండియన్స్ కు ఇప్పటివరకు 10 లక్షల వీసాలు; అమెరికా రికార్డు

HT Telugu Desk HT Telugu

28 September 2023, 19:51 IST

google News
  • US issues ‘ONE MILLION’ visas: ఇండియాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 10 లక్షల వీసాలను ప్రాసెస్ చేసినట్లు భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఈ సంవత్సరం టార్గెట్ ను చేరుకున్నామని తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US issues ‘ONE MILLION’ visas: 2023 లో ఇప్పటివరకు అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 10 లక్షల భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తయినట్లు భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ వెల్లడించారు. పెండింగ్ వీసా దరఖాస్తులు లేకుండా చేయనున్నామన్నారు. ‘‘1 మిలియన్ పూర్తయ్యాయి. 2023 లో వీసా అప్లికేషన్ల ప్రాసెసింగ్ కు సంబంధించిన టార్గెట్ ను పూర్తి చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. ఇంతటితో ఆగిపోమని, ఇంకా ఎక్కువ మంది భారతీయులు అమెరికా రావడానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది.

ప్రజా సంబంధాలు

భారత్, అమెరికా పౌరుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడాలన్నదే ఇరుదేశాల అభిమతమని భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ తెలిపారు. ఈ దిశగా భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం 10 లక్షల వీసాల ప్రాసెసింగ్ ను సాధ్యం చేసిన కాన్సులేట్ ఉద్యోగులను ఆయన అభినందించారు. మరో 3 నెలల సమయం ఉండగానే, 10 లక్షల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసిన ఉద్యోగులు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

90 వేల స్టుడెంట్ వీసాలు

ఈ వేసవిలో, జూన్ నుంచి ఆగస్ట్ మధ్య సుమారు 90 వేల స్టుడెంట్ వీసాలను జారీ చేశామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. అమెరికా జారీ చేసిన మొత్తం వీసాల్లో 25% భారతీయ స్టుడెంట్స్ పొందారని తెలిపింది. వీసాలు పొందిన ఇండియన్ స్టుడెంట్స్ కు శుభాకాంక్షలు తెలిపింది.

తదుపరి వ్యాసం