US Election Results 2024 Live : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం; 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత
06 November 2024, 19:01 IST
- US Election Results 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. తుది వరకు పోరాడిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఓడిపోయారు. ఇప్పటివరకు తేలిన వివరాల ప్రకారం, ట్రంప్ కు 280 ఎలక్టోరల్ ఓట్లు, హ్యారిస్ కు 224 ఓట్లు వచ్చాయి.
కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ట్రంప్ అభినందనలు
కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్‌కు ట్రంప్ అభినందనలు తెలిపారు. తన సహయకులు అందించిన సేవలను కొనియాడారు. ఎలాన్ మస్క్‌తో తనకున్న అనుబంధాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు.
అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు
అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ అన్నారు. ఈ రాజకీయ మార్పు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం అని గుర్తు చేశారు.
267 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపునకు దగ్గరలో ట్రంప్
డోనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా, జార్జియాలను కూడా గెలుచుకున్నారు. అతడి ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 267కి చేరుకుంది. కమలా హారిస్ 224 వద్ద ఉన్నారు.
ట్రంప్ వైపై జై కొట్టిన స్వింగ్
స్వింగ్ స్టేట్స్ మెుత్తం డొనాల్డ్ ట్రంప్ వైపై మెుగ్గుచూపాయి. ఏడు కీలక రాష్ట్రాల్లో ఇప్పటికే.. మూడు రిపబ్లికన్ల సొంత అయ్యాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అమెరికాను గొప్పగా మారుస్తా
డొనాల్డ్ ట్రంప్ తన మొదటి ప్రసంగంలో అమెరికాను గొప్పగా మారుస్తానని చెప్పారు. అన్ని స్వింగ్ స్టేట్‌లను గెలుచుకున్నట్లు చూపించారు. అపూర్వమైన రాజకీయ విజయం అని పేర్కొన్నాడు.
రెండోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు దగ్గరలో డొనాల్డ్ ట్రంప్..!
డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ట్రంప్ ముందు ఉన్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్ హవా కొనసాగింది.
ట్రంప్, మోదీకి మంచి స్నేహం
US చట్టసభ సభ్యుడు రిచర్డ్ మెక్‌కార్మిక్ భారత్, ఇండియా సంబంధాలపై మాట్లాడారు. ట్రంప్, మోదీకి మంచి స్నేహం ఉందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంలో సహాయపడతారని అన్నారు.
ట్రంగ్ గెలిచేందుకు 95 శాతం అవకాశం..
యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ గెలుపు దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ట్రంప్ గెలవడానికి 95 శాతం అవకాశాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ ప్రిడిక్టర్ చెప్పారు.
స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ జోరు
నార్త్ కరోలినాలో ట్రంప్ విజయం ఇప్పటికే ఖరారైంది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మొత్తం ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఆధిక్యం దక్కితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది.
230 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ ఆధిక్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 230 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే కమలా హారిస్ కూడా వేగంగా పుంజుకున్నారు. 205 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు.
డోనాల్డ్ ట్రంప్ గెలుచుకున్న రాష్ట్రాలు
మోంటానా
మిస్సోరి
నెబ్రాస్కా (ప్రెసిడెంట్స్ డిస్ట్రిక్ట్ 3)
టెక్సాస్
ఒహియో
వ్యోమింగ్
లూసియానా
దక్షిణ డకోటా
ఉత్తర డకోటా
నెబ్రాస్కా
అర్కాన్సాస్
ఫ్లోరిడా
ఇండియానా
వెస్ట్ వర్జీనియా
కెంటుకీ
దక్షిణ కెరొలిన
టేనస్సీ
ఓక్లహోమా
అలబామా
మిస్సిస్సిప్పి
కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలు
కొలరాడో
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా
న్యూయార్క్
ఇల్లినాయిస్
డెలావేర్
న్యూజెర్సీ
వెర్మోంట్
మేరీల్యాండ్
కనెక్టికట్
మసాచుసెట్స్
రోడ్ ఐలాండ్
ట్రంప్ వైపు యువ ఓటర్ల మెుగ్గు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపు యువ ఓటర్లు మెుగ్గుచూపించినట్టుగా తెలుస్తోంది. గతంలో 30 ఏళ్లలోపు ఓటర్లు పది మందిలో ముగ్గురు ట్రంప్‌నకు సపోర్ట్ చేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య నలుగురికి చేరింది.
డొనాల్డ్ ట్రంప్ విజయం
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి మోంటానాలో విజయం సాధించారు.
70 శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్
డెమొక్రాట్ కమలా హారిస్ న్యూయార్క్‌లో 70 శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్‌తో గెలుపొందారు.
అమెరికన్ సెనేటర్‌గా మెుదటి కొరియన్
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం.. డెమొక్రాట్ ఆండీ కిమ్ న్యూజెర్సీ సెనేట్ రేసులో గెలిచారు. అతను మొదటి కొరియన్‌గా అమెరికన్ సెనేటర్ అవుతాడు.
ఓక్లహోమాలో రిపబ్లికన్ విజయం
ఓక్లహోమాలో రిపబ్లికన్ టామ్ కోల్ తిరిగి విజయం సాధించారు. డెమొక్రాట్ మేరీ బ్రాన్నన్, స్వతంత్ర అభ్యర్థిని ఓడించాడు.
కమలా హారిస్ గెలుపు
అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన న్యూయార్క్ రాష్ట్రంలో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించారు.
కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలు
ఇల్లినాయిస్
డెలావేర్
న్యూజెర్సీ
వెర్మోంట్
మేరీల్యాండ్
కనెక్టికట్
మసాచుసెట్స్
రోడ్ ఐలాండ్
ట్రంప్ గెలిచిన రాష్ట్రాల జాబితా
ఫ్లోరిడా
ఇండియానా
వెస్ట్ వర్జీనియా
కెంటుకీ
దక్షిణ కెరొలిన
టేనస్సీ
ఓక్లహోమా
అలబామా
మిస్సిస్సిప్పి
9 రాష్ట్రాల్లో గెలుపొందిన ట్రంప్.. 5 రాష్ట్రాల్లో కమలా హారిస్
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రం ఫ్లోరిడాతో సహా 9 యుఎస్ రాష్ట్రాల్లో గెలుపొందారు. డెమొక్రాట్ కమలా హారిస్ ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ఇప్పటివరకు ట్రంప్ పైచేయి
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించబడిన ఓట్లలో 52 శాతం సాధించగా.. హారిస్ 47 శాతం సాధించారు.
రిపబ్లికన్ ఖాతాలోకి ఫ్లోరిడా
ఫ్లోరిడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ అన్నా పౌలినా లూనా తిరిగి ఎన్నికయ్యారు. లూనా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు.
ట్రంప్ ఖాతాలో మూడు రాష్ట్రాలు
ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ గెలిచారు. దీంతో మెుత్తం 23 ఎలక్టోరల్ సీట్లు ట్రంప్ ఖాతాలో చేరాయి. వెర్మాంట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించారు. ఈ మూడు ఎలక్టోరల్ సీట్లను సొంతం చేసుకున్నారు.