US military support to Ukraine: ఉక్రెయిన్ కు మళ్లీ అమెరికా మిలటరీ సాయం
28 October 2022, 22:49 IST
- US military support to Ukraine: రష్యా తో యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ కు మరోసారి మిలటరీ అసిస్టెన్స్ అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడుల దృశ్యం (ఫైల్ ఫొటో)
US military support to Ukraine: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా, పలు యూరోప్ దేశాలు దన్నుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయా దేశాలు ఉక్రెయిన్ కు సాయమందించాయి. ప్రతీకాత్మక చిత్రం
US military support to Ukraine: 275 మిలియన్ డాలర్లు..
రష్యాతో బీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు తాజాగా 275 మిలియన్ డాలర్ల మిలటరీ సాయం అందించడానికి అమెరికా సిద్దపడింది. ఈ విషయాన్ని అమెరికా శుక్రవారం ప్రకటించింది.
US military support to Ukraine: రాకెట్ లాంచర్లు..
అమెరికా అందిస్తున్న ఈ ప్యాకేజీలో హైమర్స్ ప్రెసిషన్ రాకెట్ లాంచర్ల కోసం అమ్యునిషన్, 155 ఎంఎం ఆర్టిలరీ రౌండ్స్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్, స్మాల్ ఆర్మ్స్ అమ్యునిషన్, నాలుగు సాటిలైట్ కమ్యూికేషన్ యాంటెన్నాలు ఉన్నాయని పెంటగన్ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ వెల్లడించారు.
US military support to Ukraine: రష్యా ను ఎదుర్కోవడానికే..
ఉక్రెయిన్ కు అందిస్తున్న ఈ సాయం రష్యాను దీటుగా ఎదుర్కోవడానికేనని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ మౌలిక సమాచార వ్యవస్థలు లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఆరోపించింది. అందువల్ల, తాము పంపిస్తున్న యాంటెన్నాలు యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ దళాలకు ఉపయోగపడ్డాయని పేర్కొంది. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్ కు 18.5 బిలియన్ డాలర్ల మిలిటరీ సాయం అందించింది.