తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Recruitment 2023: యూపీఎస్సీ నుంచి 111 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

UPSC Recruitment 2023: యూపీఎస్సీ నుంచి 111 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

HT Telugu Desk HT Telugu

16 January 2023, 14:23 IST

google News
    • UPSC Recruitment 2023: యూపీఎస్సీ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వివరాలు చూడండి.
UPSC Recruitment 2023: Application begins for Scientist ‘B’ and other posts
UPSC Recruitment 2023: Application begins for Scientist ‘B’ and other posts

UPSC Recruitment 2023: Application begins for Scientist ‘B’ and other posts

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 111 పోస్టులకు దరఖాస్తులు అహ్వానిస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్ ‘బీ’, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు. దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఫిబ్రవరి 2, 2023గా యూపీఎస్సీ నిర్దేశించింది.

యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2023 ఖాళీల వివరాలు

యూపీఎస్సీ ఈ రిక్రూట్మెంట్ ద్వారా 111 పోస్టులు భర్తీ చేస్తోంది. పోస్టుల వివరాలు, వేతనాలు, అర్హతల కోసం ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే నేరుగా నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుముగా రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC Recruitment 2023: దరఖాస్తు ఇలా చేసుకోవాలి..

యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ upsconline.nic.in సందర్శించాలి.

హోం పేజీలో ‘ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫర్ వేరియస్ రిక్రూట్‌మెంట్ పోస్ట్స్’ అని ఉన్న చోట క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అయ్యాక అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. అలాగే ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దానిని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

తదుపరి వ్యాసం