తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Civil Service Prelims 2023: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‍లోడ్ చేసుకోండిలా

UPSC Civil Service Prelims 2023: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‍లోడ్ చేసుకోండిలా

08 May 2023, 20:31 IST

    • UPSC Civil Service Prelims 2023 Admit Cards: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయి. ఎలా డౌన్‍లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
UPSC Civil Service Prelims 2023: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల (ఫైల్ ఫొటో) (Photo: HT Photo)
UPSC Civil Service Prelims 2023: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల (ఫైల్ ఫొటో) (Photo: HT Photo)

UPSC Civil Service Prelims 2023: యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల (ఫైల్ ఫొటో) (Photo: HT Photo)

UPSC Civil Service Prelims 2023 Admit Cards : యూపీఎస్‍సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Preliminary) పరీక్ష అడ్మిట్ కార్డులు సోమవారం (మే 8) విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. మే 28వ తేదీన దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూపీఎస్‍సీ అధికారిక వెబ్‍సైట్ upsc.gov.in ద్వారా అడ్మిట్ కార్డు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

UPSC Civil Service Prelims 2023: డౌన్‍లోడ్ చేసుకోండిలా..

  • ముందుగా upsc.gov.in వెబ్‍సైట్‍లోకి వెళ్లండి.
  • హోం పేజీలోని వాట్స్ న్యూ (What’s New) సెక్షన్‍లో e - Admit Card: Civil Services (Preliminary) Examination, 2023 అనే లింక్‍పై క్లిక్ చేయండి.
  • అనంతరం పేజీలో క్లిక్ హియర్ (Click Here) అనే లింక్‍పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత స్టెప్స్ ఫాలో అవండి.
  • ఆ తర్వాత ఇన్‍స్ట్రక్షన్స్ పేజీ వస్తుంది. అక్కడి సూచనలు జాగ్రత్తగా చదవండి. చివరగా Yes అనే బటన్‍పై క్లిక్ చేయాలి.
  • అనంతరం రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రోల్ నంబర్‌ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ/రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అక్కడే ఉన్న కోడ్‍ను ఎంటర్ చేయాలి.
  • ఆ వివరాలను ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేయండి. అప్పుడు అడ్మిట్ కార్డు స్క్రీన్‍పై కనిపిస్తుంది. ఆ అడ్మిట్ కార్డును డౌన్‍లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.

UPSC Civil Service Prelims 2023 Admit Cards : అడ్మిట్ కార్డులోని వివరాలను అభ్యర్థులు క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే యూపీఎస్‍సీకి తెలియజేయాలి. అడ్మిట్ కార్డు ప్రింటౌట్‍ను పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు తప్పకుండా తీసుకెళ్లాలి. సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు అడ్మిట్ కార్డును జాగ్రత్తగా దాచుకోవాలి. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‍పోర్టు లాంటి ఏదైనా ఓ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

తదుపరి వ్యాసం