UPSC CDS II Final Results: యూపీఎస్సీ సీడీఎస్ ఫలితాల వెల్లడి
04 July 2023, 19:47 IST
2022 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ II (CDS II) ఫైనల్ ఫలితాలను మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. యూపీఎస్సీ సీడీఎస్ UPSC II ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
2022 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ II ఎగ్జామినేషన్ (CDS II) ఫైనల్ ఫలితాలను మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. యూపీఎస్సీ సీడీఎస్ UPSC II ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవచ్చు.
మొత్తం 302 మంది అభ్యర్థులు
ఈ 2022 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ II ఎగ్జామినేషన్ (CDS II) ఫైనల్ పరీక్షలో మొత్తం 302 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పోస్ట్ లకు సంబంధించిన ఇంటర్వ్యూలు రక్షణ మంత్రిత్వ శాఖ లోని సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహించింది. వివిధ కోర్సుల్లో మొత్తం 341 పోస్ట్ లను భర్తీ చేసే లక్ష్యంతో ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు. వీటిలో 100 పోస్ట్ లు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీ (Indian Military Academy IMA) లో, 22 పోస్ట్ లు ఇండియన్ నేవల్ అకాడమీలో (Indian Naval Academy INA), 32 పోస్ట్ లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో, 170 పోస్ట్ లు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ - పురుషులు (Officers Training Academy OTA) లో, 17 పోస్ట్ లు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ - స్త్రీలు (Officers Training Academy OTA) లో భర్తీ చేస్తారు.
How to check Results: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇలా..
- ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీ పై కనిపించే UPSC CDS II Final Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
- కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
- ఆ పీడీఎఫ్ లో అభ్యర్థులు తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజ్ ను డౌన్ లోడ్ చేసి, భద్రపర్చుకోవాలి. ఒక కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
- Direct link to check UPSC CDS II Final Result 2022