UPSC CDS II 2023: యూపీఎస్సీ సీడీఎస్ II ఫలితాల వెల్లడి
03 October 2023, 19:42 IST
UPSC CDS II 2023: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2 (CDS II) పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ (UPSC) కమిషన్ మంగళవారం వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
UPSC CDS II 2023: యూపీఎస్సీ నిర్వహించిన సీడీఎస్ 2 (CDS) ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇందులో మొత్తం 6908 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వారు ఇంటర్య్వూకి హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ లో పరీక్ష..
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లెవెల్ 2 పరీక్షను సెప్టెంబర్ 3వ తేదీన జరిగింది. ఐఎంఏ, ఐఎన్ఏ (IMA & INA) అభ్యర్థులు 2024 జులై 1వ తేదీ లోగా, ఏఎఫ్ఏ అభ్యర్థులు 2024, మే 13 లోగా, ఎస్సెస్సీ అభ్యర్థులు 2024, అక్టోబర్ 1 లోగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను అభ్యర్థులు యూపీఎస్సీకి పోస్ట్ లో పంపించకూడదు. ఈ యూపీఎస్సీ సీడీఎస్ 2 పరీక్షలో ఉత్తీర్ణులు కాని అభ్యర్థుల మార్క్స్ షీట్స్ ఫైనల్ ఫలితాలను ప్రకటించిన 15 రోజుల తరువాత నుంచి upsc.gov.in. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. వెబ్ సైట్ లో అవి 30 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి.
how to check results: ఫలితాలను చెక్ చేయడం ఎలా?
- అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే “Written Result: Combined Defence Services Examination (II), 2023” లింక్ ను క్లిక్ చేయాలి.
- స్క్రీన్ పై పీడీఎఫ్ ప్రత్యక్షమవుతుంది.
- ఆ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా రిజల్ట్ చెక్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.