తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yogi Adityanath On Ram Mandir : ‘రామ మందిర నిర్మాణం.. 50శాతం పూర్తి’

Yogi Adityanath on Ram Mandir : ‘రామ మందిర నిర్మాణం.. 50శాతం పూర్తి’

Sharath Chitturi HT Telugu

07 October 2022, 7:35 IST

google News
  • Yogi Adityanath on Ram Mandir : అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్​ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్​. పనులు 50శాతం పూర్తైనట్టు వివరించారు.

యోగి ఆదిత్యనాథ్​
యోగి ఆదిత్యనాథ్​ (HT_PRINT/file)

యోగి ఆదిత్యనాథ్​

Yogi Adityanath on Ram Mandir construction : అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న రామ మందిర నిర్మాణం పనులు 50శాతం పూర్తయ్యాయి! ఈ విషయాన్ని.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ వెల్లడించారు.

గురువారం రాజస్థాన్​కు వెళ్లిన యోగి ఆదిత్యనాత్​.. శ్రీ పంచ్​ఖండ్​ పీఠ్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"రాముడికి మందిరం కావాలన్న కల 1949 నుంచి ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజున.. అయోధ్య రామ మందిర నిర్మాణం పనలు 50శాతం పూర్తయ్యాయి," అని ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు.

ఈ నేపథ్యంలో పంచ్​ఖండ్​ పీఠ్​పై పలు వ్యాఖ్యలు చేశారు.

Ayodhya Ram mandir : "మహాత్మ రామ్​చంద్ర వీర్​ జీ మహరాజ్​, స్వామి ఆచార్య ధర్మేంద్ర జీ మహరాజ్​లు దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఈ పీఠం కూడా చాలా కృషి చేసింది," అని యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు.

సంత్​ సంగం అనే కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. భారత దేశ సనాతన ధర్మం చాలా గొప్పదని, గో మాత రక్షణకు మనం చాలా విలువనిస్తామని తెలిపారు.

ఆయోధ్య రామ మందిర నిర్మాణం..

Ayodhya Ram mandir construction : రామ జన్మభూమి కేసులో 2019 నవంబర్​ 9న చారిత్రక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. 2.77 ఎకరాల్లో వివాదాస్పద భూమిని రామ జన్మభూమి ట్రస్ట్​కు అప్పగించింది. ఫలితంగా అక్కడ మందిరం రానుంది.

రామ జన్మభూమిలో గర్భ గుడి నిర్మాణం కోసం ఈ ఏడాది జూన్​లో శంకుస్థాపన చేశారు ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఇక 2020 ఆగస్టు 5న.. భూమి పూజ నిర్వహించి ఆలయ పనులను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

2024 తొలి భాగం నాటికి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నిర్మాణం కోసం భారీగా ఖర్చులు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం