తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bjp In-charge Of Karnataka Polls: కర్నాటక ఎన్నికల బీజేపీ ఇన్ చార్జిగా ధర్మేంద్ర

BJP in-charge of Karnataka polls: కర్నాటక ఎన్నికల బీజేపీ ఇన్ చార్జిగా ధర్మేంద్ర

HT Telugu Desk HT Telugu

04 February 2023, 16:30 IST

  • BJP in-charge of Karnataka polls: ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటక కు బీజేపీ (BJP) ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నియమించింది.

కేంద్ర మంత్రి, కర్నాటక బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర మంత్రి, కర్నాటక బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర మంత్రి, కర్నాటక బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్

BJP in-charge of Karnataka polls: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka polls) ముగిసే వరకు రాష్ట్రంలో బీజేపీ (BJP) ఎన్నికల ఇన్ చార్జ్ గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, అంట్రప్రెన్యూర్షిప్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వ్యవహరిస్తారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరం మే నెలలో జరిగే అవకాశముంది.

Karnataka polls: మళ్లీ అధికారమే లక్ష్యం

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్నాటక (karnataka) లో మాత్రమే బీజేపీ (BJP) అధికారంలో ఉంది. ఇక్కడ అధికారాన్ని కాపాడుకోవడం బీజేపీకి చాలా అవసరం. ఈ మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్ చార్జిగా సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ను బీజేపీ (BJP) నియమించింది. సహ ఇన్ చార్జ్ గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నియమించారు.

BJP in-charge of Karnataka Dharmendra Pradhan: సమర్ధుడైన నేత

సంస్థాగత సమస్యలను సరిదిద్ధడంలో సమర్ధుడని ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కు పేరు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో అక్కడ పార్టీ ఇన్ చార్జ్ గా వ్యవహరించిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. రాష్ట్ర బీజేపీ (BJP) లోని విబేధాలను తొలగించి, పార్టీని ఏకతాటిన నిలిపి, ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి దోహదపడ్డారు. కర్నాటకలోనూ బీజేపీలో వర్గ విబేధాలు భారీగానే ఉన్నాయి. దాంతో, కర్నాటకలో పార్టీని చక్కదిద్ది, ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యతను బీజేపీ అగ్ర నాయకత్వం ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కు అప్పగించింది.

Karnataka polls: 224 సభ్యుల అసెంబ్లీ..

కర్నాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 224. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), జేడీఎస్ (JDS) ప్రధాన పక్షాలుగా ఉన్నాయి. మేలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ (Congress) భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విజయవంతమైన నేపథ్యంలో, మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే, ఈ ఎన్నికలకు బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కనీసం 150 సీట్లలో గెలుపు లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. సొంతంగానే పోటీ చేస్తామని, జేడీఎస్ సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఇప్పటికే బీజేపీ స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం