Karnataka govt mulling of implementing UCC: ‘యూసీసీని కర్నాటకలోనూ అమలు చేస్తాం’-karnataka govt mulling implementation of uniform civil code cm bommai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Govt Mulling Of Implementing Ucc: ‘యూసీసీని కర్నాటకలోనూ అమలు చేస్తాం’

Karnataka govt mulling of implementing UCC: ‘యూసీసీని కర్నాటకలోనూ అమలు చేస్తాం’

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 03:32 PM IST

Karnataka govt mulling of uniform civil code: రాష్ట్రంలో కూడా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ఆలోచిస్తున్నామని కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు.

కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై
కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై

Karnataka govt mulling of uniform civil code: రాష్ట్రంలో అందరికీ చట్టాలు సమానంగా వర్తించాలని భావిస్తున్నామని, అందువల్ల కర్నాటకలోనూ ఉమ్మడి పౌరస్మృతి(uniform civil code) ని అమలు చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నామని సీఎం బస్వరాజ్ బొమ్మై తెలిపారు.

Constitution speaks of equality: రాజ్యాంగమే చెప్పింది

ఉమ్మడి పౌరస్మృతి(uniform civil code) అమలు రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సమానత్వం, సౌభ్రాతృతం ప్రాతిపదికన జరుగుతుందని బొమ్మై పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో శనివారం సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దశాబ్దాలుగా ఈ విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాత్రం ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా, రాష్ట్రస్థాయిలో ఉమ్మడి పౌరస్మృతి(uniform civil code)ని అమలు చేయాలన్న వాదనకు మద్దతు పెరుగుతోంది. మన రాష్ట్రంలోనూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో దీన్ని ఎలా అమలు చేయాలనే విషయంలో చర్చిస్తున్నాం’ అని బొమ్మై పేర్కొన్నారు.

On the anti-conversion law: మత మార్పిడి నిరోధక చట్టంపై..

మత మార్పిడి నిరోధక చట్టం(anti-conversion law)పై మాట్లాడుతూ.. ‘ఈ చట్టం తీసుకువచ్చినప్పుడు అంతా దీన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టమని విమర్శించారు. ఇప్పుడు బలవంతపు మత మార్పిడి నేరమని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది’ అని గుర్తు చేశారు. ‘ఏ ప్రభుత్వమైనా సమాజంలో సమానత్వం కోసం సంస్కరణలు తీసుకురావాలనుకుంటే, వాటిని తప్పుగా అన్వయించేవారు ముందు బయల్దేరుతారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భక్తులే దేవాలయాల నిర్వహణ చేపట్టేలా త్వరలో చర్యలు తీసురానున్నామని బొమ్మై వివరించారు.

IPL_Entry_Point

టాపిక్