తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Union Bank Of India Recruitment: యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

Union Bank of India Recruitment: యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

03 February 2024, 19:09 IST

google News
  • Union Bank of India Recruitment: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 23 వరకు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు..

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ. 175 కాగా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850గా నిర్ణయించారు. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లకు అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేస్తారు.

ఇలా అప్లై చేయండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా..

  • యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపించే రిక్రూట్మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
  • "యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్స్)" కోసం అప్లై లింక్ పై క్లిక్ చేయండి
  • కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులోని అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయండి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.
  • పూర్తి వివరాలకు అభ్యర్థులు www.unionbankofindia.co.in వెబ్ సైట్ లో ఉన్న డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.

తదుపరి వ్యాసం