తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  `స్నేక్ ఐలండ్‌`పై పట్టు కోసం ర‌ష్యా, ఉక్రెయిన్ భీక‌ర పోరు

`స్నేక్ ఐలండ్‌`పై పట్టు కోసం ర‌ష్యా, ఉక్రెయిన్ భీక‌ర పోరు

HT Telugu Desk HT Telugu

11 May 2022, 21:39 IST

google News
  • కీల‌క‌మైన స్నేక్ ఐలండ్‌పై ప‌ట్టు కోసం ర‌ష్యా, ఉక్రెయిన్‌లు బీక‌రంగా పోరాడుతున్నాయి. నిజానికి దాడులు ప్రారంభించిన తొలిరోజే వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన ఈ ద్వీపాన్ని ర‌ష్యా స్వాధీనం చేసుకుంది. కానీ, తాజాగా ఆ ద్వీపాన్ని మ‌ళ్లీ చేజిక్కించుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

స్నేక్ ఐలండ్‌
స్నేక్ ఐలండ్‌ (VIA REUTERS)

స్నేక్ ఐలండ్‌

బ్లాక్ సీలో వ్యూహాత్మ‌కంగా అత్యంత కీల‌క‌మైన ద్వీపం స్నేక్ ఐలండ్‌. ఈ విష‌యం తెలుసు క‌నుకే ర‌ష్యా యుద్ధం ప్రారంభించిన తొలిరోజే ఈ ద్వీపాన్ని చేజిక్కించుకుంది. అయితే, అమెరికా, యూరోప్ దేశాల ఆయుధ సాయంతో బ‌లం పుంజుకున్న ఉక్రెయిన్‌.. ర‌ష్యాపై ఎదురు దాడుల‌ను తీవ్రం చేసింది. స్నేక్ ఐలండ్‌ను మ‌ళ్లీ స్వాధీనం చేసుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ నుంచి వ‌స్తున్న యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలీకాప్ట‌ర్ల‌ను కూల్చేశామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది.

వైశాల్యం 0.17 కిమీలే..

ఈ నేప‌థ్యంలో.. బ్లాక్ సీ ప‌శ్చిమ, వాయువ్య‌ తీరంలో పట్టు ల‌భించాలంటే, వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన‌ ఈ స్నేక్ ఐలండ్‌ను చేజిక్కించుకోవ‌డం అత్య‌వ‌స‌రం. దాంతో, స్నేక్ ఐలండ్ కోసం రెండు దేశాల మ‌ధ్య యుద్ధం తీవ్ర‌మైంది. ఉక్రెయిన్‌కు, రొమేనియాకు స‌రిహ‌ద్దుల్లో ఈ చిన్న ద్వీపం `స్నేక్ ఐలండ్` ఉంటుంది. ఇది చాలా చిన్న ద్వీపం. దీని వైశాల్యం కేవ‌లం 0.17కిమీ మాత్ర‌మే. ఈ ద్వీపంపై ప‌ట్టు కోసం ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య భీక‌రంగా యుద్ధం కొన‌సాగుతుంద‌ని బుధ‌వారం బ్రిట‌న్ ప్ర‌క‌టించింది.

ఆ మాట‌ యుద్ధ నినాదమైంది..

యుద్ధం తొలిరోజు, ర‌ష్య‌న్ యుద్ధ నౌక మోస్క్‌వా(దీన్ని ఆ త‌రువాత ఉక్రెయిన్ క్షిప‌ణులు ధ్వంసం చేశాయి) ఆ ద్వీపం వ‌ద్ద‌కు వ‌చ్చింది. స్నేక్ ఐలండ్‌పై ఉన్న ఉక్రెయిన్ బోర్డ‌ర్ గార్డ్స్‌ను లొంగిపోవాల‌ని మోస్క్‌వాపై ఉన్న ర‌ష్యా సైనికులు హెచ్చ‌రించారు. దానికి స్పంద‌న‌గా ఉక్రెయిన్ బోర్డ‌ర్ గార్డ్స్ చీఫ్ రోమ‌న్ రైబోవ్.. `ర‌ష్య‌న్ వార్ షిప్‌.. గో ఫ‌..(ఎఫ్ వ‌ర్డ్‌) యువ‌ర్ సెల్ఫ్‌` అంటూ గ‌ట్టిగా స‌మాధాన‌మిచ్చారు. ఈ స్పంద‌న అక్క‌డి మైక్‌ల్లో రికార్డ‌యింది. ఆ త‌రువాత అదే మాట‌ ఉక్రెయిన్ యుద్ధ నినాద‌మైంది. వీధుల్లో పోస్ట‌ర్స్‌గా మారింది. టీ ష‌ర్ట్స్ పై స్లోగ‌న్ గా మారింది. ఆ త‌రువాత.. రోమ‌న్ రైబోవ్ స‌హా ఉక్రెయిన్ బోర్డ‌ర్ గార్డ్స్ అంద‌ర‌నీ అదుపులోకి తీసుకుని స్నేక్ ఐలండ్‌ను ర‌ష్యా స్వాధీనం చేసుకుంది. మొద‌ట వారిని ర‌ష్యా ద‌ళాలు చంపేశాయ‌ని భావించారు. అయితే, సైనికుల ఎక్స్చేంజ్‌లో భాగంగా వారిని ర‌ష్యా ఉక్రెయిన్‌కు అప్ప‌గించింది.

టాపిక్

తదుపరి వ్యాసం