తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  3.7 Crore Rupees Villa For 280 Rupees Only: రూ. 280 కే రూ. 4 కోట్ల విల్లా.. కొంటారా?

3.7 Crore rupees villa For 280 rupees only: రూ. 280 కే రూ. 4 కోట్ల విల్లా.. కొంటారా?

HT Telugu Desk HT Telugu

05 November 2022, 18:38 IST

  • 3.7 Crore villa For 280 only: బంపర్ ఆఫర్.. కనీవినీ ఎరుగని అవకాశం. జస్ట్ రూ. 280 చెల్లిస్తే చాలు.. దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన భవంతికి యజమాని ఐపోవచ్చు.

రూ. 280 కి లభించే విల్లా ఇదే
రూ. 280 కి లభించే విల్లా ఇదే

రూ. 280 కి లభించే విల్లా ఇదే

3.7 Crore villa For 280 only: రూ. 280 చెల్లిస్తే, దాదాపు రూ. 4 కోట్ల విలువైన భవనం సొంతమవుతుంది. అదికూడా ఇక్కడ కాదు. యూకేలో నమ్మశక్యంగా లేదు కదా. ఏదో మోసం ఉందనిపిస్తోంది కదా. మాయ లేదు.. మోసం లేదు. వివరాలు ఇవీ..

3.7 Crore villa For 280 only: 4 బెడ్ రూమ్ ఇల్లు

యూకేలోని మెడ్ వే, కెంట్ లో ఉన్న ఈ విలాసవంతమైన భవనం విలువ మన కరెన్సీలో సుమారు రూ. 3.7 కోట్లు. ఇది 4 బెడ్ రూమ్, ట్రిప్లెక్స్ బిల్డింగ్. ఇందులో నాలుగు పెద్ద పెద్ద బెడ్ రూమ్స్, మరో పెద్ద లివింగ్ రూమ్, ఈట్ ఇన్ కిచన్, అన్ని విలాసవంతమైన సౌకర్యాలు, పెద్ద లాన్. గోల్డెన్ ఫైర్ ప్లేస్ మొదలైనవన్నీ ఉన్నాయి. అంతేకాదు, దీనిపై ఎలాంటి లోన్లు లేవు. యూకేలో ఇంత విలువైన, విలాసవంతమైన ప్రాపర్టీని కేవలం రూ. 280కి ఎందుకు అమ్మేస్తున్నారనుకుంటున్నారా?

3.7 Crore villa For 280 only: టికెట్ ధర 280..

రూ. 280 పెడితే ఈ విల్లా మీ సొంతమైపోదు. రూ. 280 తో ఆ విల్లా మీ సొంతమయ్యే అవకాశం మాత్రం లభిస్తుంది. అంటే, మీతో పాటు దాదాపు రెండు లక్షల మంది ఈ విల్లా కోసం రూ. 280 చెల్లించి ఎదురు చూస్తుంటారన్న మాట. అర్థమైందా ఇదో రకం లాటరీ అని.

3.7 Crore villa For 280 only: 1,55,000 టికెట్లు

డేనియల్, జేసన్, విల్ అనే ముగ్గురు సోదరులు ఈ ప్రాపర్టీ ఆఫర్ తో వచ్చారు. ఈ ప్రాపర్టీని అమ్మడం కోసం రూ. 280 విలువైన కనీసం 1,55,000 టికెట్లను వారు అమ్ముతారు. అనంతరం, లాటరీ పద్ధతి ద్వారా లక్కీ విన్నర్ ఎవరో తేలుస్తారు. ఒకవేళ, ఆ కనీస మొత్తం(1,55,000) టికెట్లు అమ్ముడుపోకపోతే, విన్నర్ గా తేలిన వ్యక్తికి.. టిక్కెట్లు అమ్మగా వచ్చిన మొత్తంలో 70% ఇస్తారు. బావుంది కదా బిజినెస్.

3.7 Crore villa For 280 only: ఇదే మొదలు కాదు..

ఈ తరహాలో ప్రాపర్టీలను అమ్మేయడం ఆ బ్రదర్స్ కుఇదే మొదలు కాదు. గతంలోనూ పలు ప్రాపర్టీలను ఇలా అమ్మేసి లాభాలు మూటగట్టుకున్నారు. కోవిడ్ టైమ్ లో ఈ ఐడియా వచ్చిందట వీరికి. దాంతో, తమ సొంత ఇంటిని ఇలాగే అమ్మేశారు. ఆ తరువాత, చాలా మంది నుంచి మళ్లీ ఎప్పుడు ఇలాంటి ఆఫర్ తో వస్తారు అని వీరికి చాలా మెయిల్స్, మెసేజెస్ వచ్చాయట. దాంతో ‘Tramway Path’ పేరుతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు.