తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Two Uteruses, Two Babies: వైద్య చరిత్రలో అరుదైన అద్భుతం; రెండు గర్భాశయాలు, ఒకేసారి ఇద్దరు పిల్లలు

Two uteruses, two babies: వైద్య చరిత్రలో అరుదైన అద్భుతం; రెండు గర్భాశయాలు, ఒకేసారి ఇద్దరు పిల్లలు

HT Telugu Desk HT Telugu

23 December 2023, 17:36 IST

google News
  • Two uteruses, two babies: వైద్య చరిత్రలోనే ఒక అరుదైన అద్భుతం అమెరికా యువతి విషయంలో చోటు చేసుకుంది. రెండు గర్భాశయాలు ఉన్న ఆ యువతి రెండు వేర్వేరు రోజుల్లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

తన ఇద్దరు కవల పిల్లలతో కెల్సీ హేచర్
తన ఇద్దరు కవల పిల్లలతో కెల్సీ హేచర్ (Instagram/@doubleuhatchlings)

తన ఇద్దరు కవల పిల్లలతో కెల్సీ హేచర్

Two uteruses, two babies: అమెరికాలోని కెల్సీ హేచర్ (Kelsey Hatcher) అనే యువతి ఇటీవల రెండు వేర్వేరు రోజుల్లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది నాలుగో ప్రెగ్నెన్సీ.

రెండు గర్భాశయాలు..

కెల్సీ హేచర్ (Kelsey Hatcher) కు రెండు గర్భాశయాలు (uterus), రెండు గర్భాశయ ముఖ ద్వారాలు (cervix) ఉన్నాయి. ఇలా ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘‘డైడెల్ఫిక్ యుటెరస్ (didelphic uterus)’’ అంటారు. తనకు డైడెల్ఫిక్ యుటెరస్ ఉన్న విషయం ఆమెకు తన 17 ఏళ్ల వయస్సులో తెలిసింది. తాను 4వ సారి గర్భం దాల్చిన మే 23, 2023 నుంచి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ‘doubleuhatchlings’ ద్వారా తన గర్భం వివరాలను ఆమె షేర్ చేసుకుంటోంది. తన ప్రెగ్నెన్సీ ఫొటోలను, బేబీస్ గ్రోత్ వివరాలను పంచుకుంటోంది. తాజాగా, తనకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారని, వారు వేర్వేరు రోజుల్లో జన్మించారని ఆమె వెల్లడించింది. వారి పేర్లు రోక్సీ లేలా (Roxi Layla), రెబెల్ లాకెన్ (Rebel Laken) అని తెలిపింది.

మెడికల్ మిరాకిల్

ఇలా రెండు వేర్వేరు గర్భాశయాల ద్వారా ఇద్దరు పిల్లలు ఒక రోజు వ్యవధిలో జన్మించడం చాలా అరుదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోక్సీ లేలా డిసెంబర్ 19 మంగళవారం రాత్రి 7:49 గంటలకు జన్మించగా, రెబెల్ లాకెన్ (Rebel Laken) డిసెంబర్ 20, బుధవారం ఉదయం 6:09 గంటలకు జన్మించిందని కెల్సీ హేచర్ వెల్లడించింది. వారు చాలా అరుదైన పిల్లలని తెలిపింది.

తదుపరి వ్యాసం