Two non-local labourers shot at in J-K: కశ్మీర్లో ఉగ్రవాదుల మరో ఘాతుకం
24 September 2022, 22:45 IST
Two non-local labourers shot at in J-K: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఈ మధ్య కాలంలో భద్రతా బలగాలు, స్థానికేతరులు లక్ష్యంగా దాడులు చేస్తున్న టెర్రరిస్ట్ లు మరోసారి కూడా వారే లక్ష్యంగా దాడి చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
Two non-local labourers shot at in J-K: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానికంగా పని చేస్తున్న స్థానికేతరులపై కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఇద్దరు నాన్ లోకల్స్ తీవ్రంగా గాయపడ్డారు.
Two non-local labourers shot at in J-K: పరిస్థితి విషమం
పుల్వామా జిల్లాలోని కాకాపొర ప్రాంతంలో ఉన్న ఖర్బోతాపోర్ లో శనివారం సాయంత్రం స్థానికేతరులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆ ఇద్దరు బిహార్ లోని బాట్యా జిల్లాకు చెందిన వలస కూలీలైన షంషాద్, ఫైజాన్ ఖాద్రీ లుగా గుర్తించారు.