తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us President Elections: స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ వెనుకంజ; ట్రంప్ వైపు మొగ్గు; తాజా పోల్ లో వెల్లడి

US President elections: స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ వెనుకంజ; ట్రంప్ వైపు మొగ్గు; తాజా పోల్ లో వెల్లడి

HT Telugu Desk HT Telugu

05 April 2024, 18:24 IST

  • US President elections: త్వరలో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖాయమైన డొనాల్డ్ ట్రంప్ నకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. తాజా పోల్ లో స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ పై ట్రంప్ నకు స్పష్టమైన ఆధిక్యత వ్యక్తమైంది.

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ (AFP)

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్

US President elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ ప్రకారం ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఆరింటిలో జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, మిషిగాన్, అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినా ఓటర్లలో ట్రంప్ నకు 2 నుండి 8 శాతం పాయింట్ల మధ్య ఆధిక్యం ఉందని బుధవారం విడుదల చేసిన సర్వేలో తేలింది.

ట్రెండింగ్ వార్తలు

Monsoon: దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడంపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ

Fact Check: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

స్వింగ్ స్టేట్స్ రిజల్ట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ రాష్ట్రాల్లో 6 చోట్ల బైడెన్ కంటే ట్రంప్ ముందంజలో ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఏడో రాష్ట్రమైన విస్కాన్సిన్ లో బహుళ అభ్యర్థుల బ్యాలెట్లో బైడెన్ ఇప్పటికే 3 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా, ఇద్దరు ప్రత్యర్థులు ముఖాముఖి పోటీలో ఉన్నారని రాయిటర్స్ తెలిపింది. ఉద్యోగ వృద్ధి, ఆరోగ్యకరమైన వ్యయం, ఊహించిన దానికంటే మెరుగైన జీడీపీ పెరుగుదల ఉన్నప్పటికీ బైడెన్ పై ఓటర్లలో వ్యతిరేకత నెలకొనడం గమనార్హం. ఇది డెమొక్రాటిక్ రాజకీయ వ్యూహకర్తలను కలవరపెడుతోంది.

బైడెన్ పై వ్యతిరేకత

ఈ పోల్ లో బైడెన్ పై వ్యక్తమైన ప్రతికూల అభిప్రాయాలు సానుకూల అభిప్రాయాల కంటే కనీసం 16 శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోని స్వింగ్ స్టేట్స్ లో నాలుగు రాష్ట్రాల్లో ఇది 20 పాయింట్లకు పైగా ఉన్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఒకటైన అరిజోనాలో మాత్రమే ట్రంప్ నెగటివ్ రేటింగ్ పొందారు. అంతేకాకుండా, మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం ఉన్న ట్రంప్ అధ్యక్ష పదవికి బాగా సరిపోతారని చాలా మంది ఓటర్లు భావించారని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ విషక్ష్ంలో బైడెన్ కు అనుకూలంగా 28 శాతం ఓట్లు రాగా, ట్రంప్ నకు 48 శాతం ఓట్లు వచ్చాయి. మార్చి 17-24 తేదీల్లో ఏడు రాష్ట్రాల్లో 600 చొప్పున 4,200 ఓట్లపై ఈ సర్వే నిర్వహించారు.

తదుపరి వ్యాసం