Donald Trump : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్​ ట్రంప్​!-donald trump to announce 2024 us presidential bid next week top aide confirms this ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Donald Trump To Announce 2024 Us Presidential Bid Next Week, Top Aide Confirms This

Donald Trump : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్​ ట్రంప్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 12, 2022 09:17 AM IST

Donald Trump 2024 US presidential election : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ పోటీ చేయనున్నారు. ఇదే విషయంపై వచ్చే వారం కీలక ప్రకటన చేయనున్నారు!

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్​ ట్రంప్​!
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్​ ట్రంప్​! (Reuters/file)

Donald Trump 2024 US presidential election : వచ్చే వారంలో ఓ కీలక ప్రకటన చేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇటీవలే తెలిపారు. ఈ నేపథ్యంలో.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బరిలో దిగుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా.. ఈ విషయంపై ట్రంప్​ సన్నిహితుడు క్లారిటీ ఇచ్చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ పోటీచేస్తారని, ఈ విషయాన్నే వచ్చే వారం చెబుతారని ఆయన సలహాదారు జేసన్​ మిల్లర్​ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఎన్నికల ప్రచారాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు డొనాల్డ్​ ట్రంప్​. ఈ క్రమంలోనే కొన్ని రోజుల్లో కీలక ప్రకటన చేస్తానని అన్నారు.

తాజాగా ఈ విషయాన్ని ట్రంప్​ దీర్ఘకాలిక సలహాదారు జేసన్​ మిల్లర్​.. ఓ పాడ్​క్యాస్ట్​లో ప్రస్తావించారు.

2024 US presidential election : "అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వచ్చే మంగళవారం డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించనున్నారు. ఈ ప్రకటన చాలా ప్రొఫెషనల్​గా ఉంటుంది. 'ఈ విషయంలో అసలు సందిగ్ధతే వద్దు. నేను పోటీ చేస్తున్నా,' అని ట్రంప్​ నాకు చెప్పారు," అని మిల్లర్​ వెల్లడించారు.

2024 నాటికి ట్రంప్​ వయస్సు 78గా ఉంటుంది. 2024 ఎన్నికల్లో బరిలో దిగితే.. అధ్యక్ష పదవి కోసం ఆయన మూడోసారి పోటీలో నిలిచినట్టు అవుతుంది.

సవాళ్లు ఎన్నో..

2020లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​ చేతిలో ఓటమి పాలయ్యారు డొనాల్డ్​ ట్రంప్​. అనంతరం జరిగిన యూఎస్​ క్యాపిటల్​ హింసాకాండలో ఆయన హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ట్రంప్​ ఇంత త్వరగా ప్రకటించడానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. తాను శక్తివంతంగా ఉన్నట్టు ఈ విధంగా ట్రంప్​ చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Donald trump latest news : మరోవైపు.. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్​నకు చెందిన రిపబ్లికెన్​ పార్టీ ప్రదర్శన.. అంచనాలను తలకిందులు చేసింది. ప్రతినిధుల సభలో పైచేయి సాధించినప్పటికీ.. ఆశించిన మేర ఫలితాలు రాలేదు. ట్రంప్​ స్వయంగా ఎంపిక చేసిన అభ్యర్థులెందరో ఓటమి పాలయ్యారు.

ఇదే సమయంలో.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికెన్​ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిచిన ఫ్లొరిడా గవర్నర్​ రాన్​ డేసాంటిస్​ కూడా 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాన్​ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన ట్రంప్​.. పార్టీలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకే.. ఇంత తొందరగా అధ్యక్ష ఎన్నికలపై ప్రకటన చేస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం