తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  West Bengal Student : విశాఖలో బెంగాల్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి, దర్యాప్తునకు ఆదేశించిన సీఎం మమతా బెనర్జీ

West Bengal Student : విశాఖలో బెంగాల్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి, దర్యాప్తునకు ఆదేశించిన సీఎం మమతా బెనర్జీ

20 August 2023, 23:01 IST

google News
    • West Bengal Student :విశాఖలో ఇటీవల పశ్చిమ బెంగాల్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. కోల్ కతాలో బాధిత కుటుంబాన్ని పశ్చిమ బెంగాల్ మంత్రి బిస్వాస్ పరామర్శించారు. సీఎం మమతా బెనర్జీ కూడా బాధిత కుటుంబంతో ఫోన్ మాట్లాడారు.
విశాఖలో బెంగాల్ విద్యార్థిని మృతి
విశాఖలో బెంగాల్ విద్యార్థిని మృతి

విశాఖలో బెంగాల్ విద్యార్థిని మృతి

West Bengal Student : విశాఖలో జులై 16న అనుమానాస్పద రీతిలో పశ్చిమ బెంగాల్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తెలిపారు. మంత్రి బిస్వాస్ ఆదివారం దక్షిణ కోల్‌కతాలోని నేతాజీ నగర్ లో నివసిస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాలిక తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థిని మరణంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెంగాల్ విద్యార్థిని(16) జులై 16న విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో మరణించింది. ఆమె మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు విశాఖలోని ఒక ప్రైవేట్ శిక్షణా సంస్థలో చేరింది. ఆ సంస్థ హాస్టల్ పై నుంచి పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మృతి చెందింది. తన కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా విశాఖపట్నం పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని బాలిక తండ్రి మంత్రి బిశ్వాస్, ముఖ్యమంత్రి ముందు వాపోయారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం జులైలో ఏపీ హైకోర్టులో కేసు వేసింది. విద్యార్థిని కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మంత్రి బిశ్వాస్ తెలిపారు. అవసరమైతే ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామన్నారు.

విశాఖలో ఎఫ్ఐఆర్

అవుట్‌స్టేషన్ విద్యార్థులపై హాస్టళ్లలో ర్యాగింగ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్‌లో ఆగస్టు 9న ర్యాగింగ్‌కు గురైన మొదటి సంవత్సరం విద్యార్థి మరణించాడు. కోల్‌కతా పోలీసులు శనివారం రాత్రి వరకు 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో హాస్టల్‌లో ఉంటున్న పూర్వ విద్యార్థులు ఉన్నారు. అయితే రాష్ట్ర పోలీసుల అధికార పరిధిపై న్యాయవాదులు ప్రశ్నలు సంధించారు. ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు మరొక రాష్ట్రంలో దర్యాప్తు చేయలేరు, ప్రత్యేకించి ఇప్పటికే విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని క్రిమినల్ లాయర్ సబ్యసాచి ఛటర్జీ తెలిపారు.

తదుపరి వ్యాసం