తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Results: కుమారస్వామి ఆశలు గల్లంతు; పోరాటం కొనసాగుతుందన్న జేడీఎస్ నేత

Karnataka results: కుమారస్వామి ఆశలు గల్లంతు; పోరాటం కొనసాగుతుందన్న జేడీఎస్ నేత

HT Telugu Desk HT Telugu

13 May 2023, 14:57 IST

google News
  • Karnataka results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (karnataka assembly elections 2023) కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఘన విజయం దాదాపు ఖాయమైంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, తాను కింగ్ మేకర్ గా అవతరిస్తానని జేడీఎస్ నేత కుమారస్వామి (HD Kumaraswamy) ఆశించారు. కానీ, ఆయన కలలు కల్లలయ్యాయి.

జేడీఎస్ నేత కుమార స్వామి
జేడీఎస్ నేత కుమార స్వామి

జేడీఎస్ నేత కుమార స్వామి

Karnataka results: మరోసారి కింగ్ మేకర్ గానో, లేక అదృష్టం కలిసివస్తే, మళ్లీ ముఖ్యమంత్రిగానో అవతరిస్తానని జేడీఎస్ నేత కుమార స్వామి (HD Kumaraswamy) కన్న కలలు కల్లలయ్యాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తేలడంతో కుమార స్వామి ఆశలు గల్లంతయ్యాయి. కింగ్ మేకర్ గా కుమార స్వామి (HD Kumaraswamy) నిలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ సైతం నిర్ధారించడంతో, కుమార స్వామితో పొత్తు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రయత్నాలు కూడా చేశాయి. ఫలితాల అనంతరం, కాంగ్రెస్ తోనో, బీజేపీతోనో పొత్తు పెట్టుకుంటామని కుమార స్వామి కూడా ప్రకటించారు.

Karnataka results: పోరాటం కొనసాగుతుంది..

ఒకవైపు, ఆశించిన స్థాయిలో సీట్లను గెల్చుకోలేకపోవడం, మరోవైపు, కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ లభించడం జేడీఎస్ కు అశనిపాతంగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమార స్వామి (HD Kumaraswamy) ఒక ప్రకటన చేశారు. ‘‘ఈ పరాజయం చివరిది కాదు.. నా పోరాటం ఆగదు. నేను ప్రజలతోనే ఉంటాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. త్వరలో ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రజా తీర్పును శిరసావహిస్తాను. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు ఇచ్చే తీర్పే అంతిమం. ఈ పరాజయాన్ని అంగీకరిస్తున్నాను. నేను విజయాలను, పరాజయాలను ఒకేలా స్వీకరిస్తాను’’ అని మరో ట్వీట్ లో కుమారస్వామి (HD Kumaraswamy) పేర్కొన్నారు. విజయాలు, పరాజయాలు తనకు, తన కుటుంబానికి కొత్త కాదన్నారు. గతంలో తన తండ్రి దేవేగౌడ కూడా పరాజయం పాలయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) చెన్న పట్న నియోజకవర్గం నుంచి కుమార స్వామి (HD Kumaraswamy) పోటీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమీప బీజేపీ అభ్యర్థిపై కేవలం 4 ఓట్ల మెజారిటీ తో ఉన్నారు.

తదుపరి వ్యాసం