WHO chief Thanks PM Modi: ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్
08 January 2024, 22:12 IST
WHO chief Thanks PM Modi at G20: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టె్డ్రోస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దాంతో పాటు, మోదీతో దిగిన ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు.
భారత ప్రధానితో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్
WHO chief Thanks PM Modi at G20: ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) చీఫ్ టెడ్రోస్ మంగళవారం ఒక ఫొటోను షేర్ చేసుకున్నారు. భారత ప్రధాని మోదీతో పాటు తాను ఉన్న ఆ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ, భారత ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు.
WHO chief Thanks PM Modi at G20: సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటు
భారత్ లో సంప్రదాయ వైద్య విధానాలకు సంబంధించి అత్యాధునిక సౌకర్యాలతో ఒక అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ టెడ్రోస్ ఆ ట్వీట్ చేశారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన ఆ traditional health centre ప్రారంభోత్సవ కార్యక్రమానికి టెడ్రోస్ కూడా వచ్చారు. ఆ కేంద్రాన్ని డబ్ల్యూహెచ్ఓ సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీ 20 సదస్సులో పాల్గొనడం కోసం భారత ప్రధాని మోదీ, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఇండోనేషియాలోని బాలిలో ఉన్నారు.
WHO chief Thanks PM Modi at G20: కోవిడ్ దారుణాలు
జీ 20 సదస్సులో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేశాయో వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థలను కూడా కరోనా నాశనం చేసిన విషయాన్ని వివరించారు. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80 శాతం మంది సంప్రదాయ వైద్య విధానాలను అనుసరిస్తుంటారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అలాగే, 170 దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాలు క్రియాశీలంగా ఉన్నాయని పేర్కొంది.
టాపిక్