తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tejashwi Yadav On New Jet Purchase: ‘‘మేం హెలీకాప్టర్ కొంటే మీకేం బాధ’’

Tejashwi Yadav on new jet purchase: ‘‘మేం హెలీకాప్టర్ కొంటే మీకేం బాధ’’

HT Telugu Desk HT Telugu

29 December 2022, 19:15 IST

  • Tejashwi Yadav on new jet purchase: సొంతంగా జెట్ ప్లేన్ ను, హెలీకాప్టర్ ను కొనుగోలు చేయాలన్న బిహార్ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ దుమారం చెలరేగింది. 

బిహార్ డెప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
బిహార్ డెప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (HT_PRINT)

బిహార్ డెప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

Tejashwi Yadav on new jet purchase: రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక జెట్ విమానాన్ని, ఒక హెలీకాప్టర్ ను కొనుగోలు చేయాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆ నిర్ణయంపై పునరాలోచించాలని నితీశ్ ప్రభుత్వాన్ని కోరింది.

ట్రెండింగ్ వార్తలు

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

Tejashwi Yadav on new jet purchase: సొంతంగా లేనందువల్లనే..

బీజేపీ విమర్శలపై ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం తరఫున జెట్ విమానాన్ని, చాపర్ ను కొనాలని తీసుకున్న నిర్ణయంపై బీజేపీకి ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. చాలా రాష్ట్రాలకు సొంతంగా విమానాలు, చాపర్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీవీఐపీలు వినియోగించడానికి చాపర్లను లీజు కు తీసుకునేవారని, అందుకు బదులుగా, ఇప్పుడు సొంతంగా వాటిని కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తేజస్వీ యాదవ్ వివరించారు.

Tejashwi Yadav on new jet purchase: సీఎం అయ్యాక తిరగాలని..

త్వరలో బిహార్ ముఖ్యమంత్రి ని అవుతానని తేజస్వీ యాదవ్ కలలు కంటున్నారని, అందువల్ల సీఎం అయిన తరువాత వాడడం కోసం ఇప్పుడు బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేత జెట్ విమానాన్ని, హెలీకాప్టర్ ను కొనిపిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటించడానికి కూడా వాటిని వాడాలన్నది వారి ప్రణాళిక అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, విమానం, చాపర్ కొనుగోలు నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన కోరారు.