తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Car Sales In July: టాటా మోటార్స్ కార్ సేల్స్ 51 శాతం అప్.. మారుతీ 8.28 శాతమే

Car sales in july: టాటా మోటార్స్ కార్ సేల్స్ 51 శాతం అప్.. మారుతీ 8.28 శాతమే

HT Telugu Desk HT Telugu

01 August 2022, 16:38 IST

google News
    • Car sales in july: అత్యధికంగా అమ్ముడుపోయే మారుతీ సుజుకీ కార్ సేల్స్ జూలై నెలలో 8.28 శాతం పెరగగా, టాటా మోటార్స్ సంస్థ అమ్మకాలు 51 శాతం పెరిగాయి. కియా మోటార్ కార్ సేల్స్ కూడా 47 శాతం పెరిగాయి.
జూలై నెలలో టాటా మోటార్స్ విక్రయాలు భారీగా పెరిగాయి
జూలై నెలలో టాటా మోటార్స్ విక్రయాలు భారీగా పెరిగాయి (Bloomberg)

జూలై నెలలో టాటా మోటార్స్ విక్రయాలు భారీగా పెరిగాయి

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ దేశీయ విపణిలో తమ ప్యాసింజర్ వాహనాల పటిష్ట పనితీరు కారణంగా జులై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం పెరిగి 81,790 యూనిట్లుగా నమోదైంది.

గతేడాది జూలైలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ మొత్తం 54,119 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

జూలై 2021లో 51,981 యూనిట్లతో పోలిస్తే గత నెలలో మొత్తం దేశీయ విక్రయాలు 78,978 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే 52 శాతం వృద్ధిని సాధించింది.

దేశీయ విపణిలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 57 శాతం వృద్ధితో 30,185 యూనిట్ల నుంచి 47,505 యూనిట్లకు పెరిగాయి.

ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గత ఏడాది జూలైలో 604 యూనిట్ల నుంచి 4,022 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది.

దేశీయ విపణిలో వాణిజ్య వాహనాల విక్రయాలు జూలై 2022లో 31,473 యూనిట్లుగా ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో 21,796 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతీ సుజుకీ సేల్స్ 8.28 శాతం అప్

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ జులై 2022లో 1,75,916 కార్లను అమ్మింది. గత ఏడాది జూలైతో పోల్చితే 8.28 శాతం పెరిగాయి.

గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1,62,462 యూనిట్లను విక్రయించినట్లు మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు జూలై 2021లో 1,33,732 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 6.82 శాతం పెరిగి 1,42,850 యూనిట్లకు చేరుకున్నాయి.

"ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొరత ప్రధానంగా దేశీయ మోడళ్లలో వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపింది" అని కంపెనీ తెలిపింది.

ఆల్టో, ఎస్-ప్రెస్సోతో సహా మినీ కార్ల అమ్మకాలు 20,333 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం 19,685 అమ్ముడుపోయాయి.

అదేవిధంగా బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్‌తో సహా కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా జూలై 2022లో 84,818 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది.

అయితే, యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, ఎర్టిగా S-క్రాస్, XL6తో సహా యుటిలిటీ వాహనాలు గత ఏడాది జులై నెలలో 32,272 యూనిట్లు అమ్మగా.. ఇప్పుడు 23,272 కార్లను మాత్రమే అమ్మింది.

మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ విక్రయాలు కూడా గత నెలలో 1,450 యూనిట్ల నుంచి 1,379 యూనిట్లకు తగ్గాయని కంపెనీ తెలిపింది.

MSIL గత నెలలో 13,048 యూనిట్ల వాన్ ఈకోను విక్రయించింది. జూలై 2021లో 10,057 యూనిట్లు అమ్ముడయ్యాయి. లైట్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్‌లో గత జూలైలో 2,768 యూనిట్లతో పోలిస్తే సూపర్ క్యారీ మోడల్‌లో 2,816 యూనిట్లను విక్రయించింది.

47 శాతం పెరిగిన కియా మోటార్స్ విక్రయాలు

గత ఏడాది జూలై నెలతో పోలిస్తే ఈ జూలైలో టోకు విక్రయాలు 47 శాతం పెరిగి 22,022 యూనిట్లకు చేరుకున్నాయని కియా మోటార్స్ సోమవారం తెలిపింది.

జూలై 2021లో కంపెనీ 15,016 యూనిట్లను అమ్మింది. గత నెలలో 8,451 యూనిట్ల సెల్టోస్, 7,215 యూనిట్ల సోనెట్‌ కార్లను విక్రయించింది.

ఇది జూలైలో 5,978 యూనిట్ల కేరెన్స్, 288 కార్నివాల్ కార్లను విక్రయించింది.

‘సరఫరా వ్యవస్థలో క్రమంగా మెరుగుదల కనిపించింది. బ్రాండ్ పట్ల కస్టమర్ల ఆదరణ పెరుగుతోంది..’ అని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం